సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో అంతకంతకూ అధికమవుతున్న కరోనా వైరస్ గడిచిన 24 గంటల్లో 55,722 పాజిటివ్ కేసులు నమోదవడంతో 75 లక్షల మార్కుని దాటింది. వైరస్ బాధితుల్లో తాజాగా 579 మంది మృతి చెందడంతో ఆ మొత్తం సంఖ్య 1,14,610 కు చేరింది. దేశ వ్యాప్తంగా మరో 66,399 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 66,63,608. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,72,055. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 88.26 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 10.23 శాతం యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించికంది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,59,876 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. మొత్తం పరీక్షల సంఖ్య 9,50,83,976 కు చేరిందని పేర్కొంది. ఇక 83,87,799 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 75,50,273 కేసులతో భారత్ రెండో స్థానంలో, 52, 35,344 కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో అత్యధికంగా 2,24,730 మంది కోవిడ్ బారినపడి మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment