సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గచిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 74,383 పాజిటివ్ కేసులు నమోదవంతో.. మొత్తం కేసుల సంఖ్య 70,53,807 కు చేరింది. వైరస్ బాధితుల్లో తాజాగా 918 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,08,334 కు చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 89,154 మంది వైరస్ రోగులు కోలుకున్నారు. దేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 60,77,976. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 8,67,496.
ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 86.17 శాతంగా ఉందని తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు12.30 శాతం ఉన్నాయని వెల్లడించింది. మరణాల రేటు 1.54 శాతానికి తగ్గిందని పేర్కొంది. శనివారం ఒక్కరోజే 10,78,544 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి 8,68,77,242 నమూనాలు పరీక్షించామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment