న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,674 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బాధితుల్లో మరో 559 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,26,121 కు చేరింది. తాజా కేసులతో భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 85,07,754 కి చేరగా... 5,12,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం ఒక్కరోజే 49,082 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో.. కోలుకున్నవారి మొత్తం సంఖ్య 78,68,968 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
కోవిడ్ రోగుల రికవరీ రేటు 92.49 శాతానికి పెరిగిందిని తెలిపింది. భారత్‌లో కోవిడ్ మరణాల రేటు 1.48 శాతంగా ఉందని.. దానిని ఒక శాతానికి తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. అదే సమయంలో రాష్ట్రాలవారీగా కరోనా వైరస్ పాజిటివిటీ రేటును 5 శాతానికి పరిమితం అయ్యేలా పనిచేస్తున్నామని బులెటిన్‌లో పేర్కొంది. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో 6.03 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది. శీతాకాలం కావడంతో కరోనా అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment