
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో పెరుగుల రికార్డులు నమోదు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఉన్న భారత్‌ను మరో మెట్టు ఎక్కించే దిశగా సాగుతోంది. దేశంలో కొత్తగా రికార్డు స్థాయిలో 83,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 39,36,748 కు చేరింది. భారీ స్థాయిలో కేసుల నమోదును బట్టి చూస్తే రేపటికల్లా బ్రెజిల్‌ను దాటేసి భారత్ రెండోస్థానానికి ఎగబాకడం ఖాయం. 40,46,150 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 63,35,244 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 1,096 మంది మృతి చెందడంతో ఆ సంఖ్య 68,472 కు చేరింది. కోవిడ్ బారినుంచి ఇప్పటివరకు 30,37,152 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 8,31,124 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కరోనా బాధితుల రికవరీ రేటు 77 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,69,765 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని భారత్ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
ఇప్పటివరకు 4,66,79,185 నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. కాగా, బుధవారం ఒక్కరోజే దేశంలో 83,883 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కరోజే ఇన్నేసి కేసులు నమోదైన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
(చదవండి: ఐపీఎల్ 2020: బీసీసీఐకి మరో సవాల్)
Comments
Please login to add a commentAdd a comment