న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 చేరింది. ఆదివారం ఒక్కరోజే కోవిడ్ బాధితుల్లో 971 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64,469 కు చేరింది. గత 24 గంటల్లో 60,868 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 27,74,802 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు.
భారత్‌లో ప్రస్తుతం 7,81,975 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 76.61 శాతంగా ఉందని తెలిపింది. అలాగే నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 21.60 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. మరణాల రేటు 1.79 శాతానికి తగ్గిందని పేర్కొంది. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 8,46,278 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపింది. దాంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 4,23,07,914 కు చేరిందని వెల్లడించింది.
(చదవండి: ఈ ఏడాది జనగణన లేనట్లే!)
Comments
Please login to add a commentAdd a comment