
సాక్షి, గుంటూరు: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మానవత్వాన్ని చాటుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఓ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో.. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి.
ఓ రివ్యూ సమావేశం కోసం సెక్రెటేరియట్‌కు వెళ్తున్న మంత్రి విడదల రజిని.. ప్రమాద ఘటనను చూసి చలించిపోయారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి బాధితులకు ధైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బందితో బాధితులను గుంటూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను మంత్రి విడదల రజిని ఆదేశించారు.
చదవండి: సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీద మస్తాన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment