మహమ్మారి కట్టడికి కేంద్ర బృందాలు | Centre to send teams to 15 states with high coronavirus cases | Sakshi
Sakshi News home page

మహమ్మారి కట్టడికి కేంద్ర బృందాలు

Published Tue, Jun 9 2020 3:02 PM | Last Updated on Tue, Jun 9 2020 4:46 PM

Centre to send teams to 15 states with high coronavirus cases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సాయంగా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50కి పైగా జిల్లాలు, నగరపాలక, మున్సిపాల్టీలకు అత్యున్నత కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మహారాష్ట్ర(ఏడు జిల్లాలు/మున్సిపాలిటీలు), తెలంగాణ (4 జిల్లాలు), తమిళనాడు (7), రాజస్ధాన్‌ (5), అసోం (6), హరియాణ (4), గుజరాత్‌ (3), కర్ణాటక (4), ఉత్తరాఖండ్‌ (3), మధ్యప్రదేశ్‌ (5), పశ్చిమ బెంగాల్‌ (3), ఢిల్లీ (3), బిహార్‌ (4), యూపీ (4), ఒడిషాలో 5 జిల్లాలకు కేంద్ర బృందాలు రానున్నాయి. ఆయా జిల్లాల్లో కోవిడ్‌-19 వ్యాప్తి, సంక్రమణను అడ్డుకునేందుకు అనువైన వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించడంలో స్ధానిక అధికారులకు కేంద్ర బృందాలు మార్గనిర్ధేశకం చేస్తాయి.

చదవండి : చైనాలో ఆగ‌స్టులోనే క‌రోనా విజృంభణ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement