సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 45,720 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. మహమ్మారి బారినపడి 1129 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 30,000కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,38,635కు చేరగా వ్యాధి నుంచి 1129 కోలుకుని 7,82,606 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 4,26,167 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఇకక ఈనెల 22 వరకూ 1,50,75,369 శాంపిళ్లను పరీక్షించగా, బుధవారం ఒక్కరోజే 3,50,823 కరోనా పరీక్షలు జరిగాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లపై నిర్వహిస్తున్న మానవ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వెల్లడవుతుండటం ఆశలు రేకెత్తిస్తోంది. చదవండి : 2021 తర్వాతే వ్యాక్సిన్: డబ్ల్యూహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment