
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌పై పోరాటంలో వ్యాక్సిన్, ఔషధాల ద్వారానే విజయం సాధిస్తామని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు. కరోనా వైరస్‌కు భారత్ నుంచి ఏడాదిలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. మన ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిశ్రమ ఈ విషయంలో మెరుగైన సామర్ధ్యం కనబరుస్తుందని వ్యాఖ్యానించారు. భారత్ ఫార్మా రంగం అభివృద్ధి చేసే వ్యాక్సిన్లు ప్రపంచ దేశాల్లో పేరొందాయని గుర్తుచేశారు.
భారత్‌లో దాదాపు 30 సంస్థలు, గ్రూపులు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని, వీటిలో 20 సంస్థల ప్రయత్నాలు పురోగతిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ శాస్ర్తీయ సలహాదారు ప్రొఫెసర్ కే విజయరాఘవన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 6566 తాజా కేసులు నమోదవగా 194 మంది మరణించారు. మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,58,333కి పెరిగింది. ఇక మహమ్మారి బారినపడిన వారిలో ఇప్పటివరకూ 67,692 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 4581కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment