
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నా ప్రాణాంతక వైరస్ కట్టడిపై కొన్ని సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. కోవిడ్-19 బారినపడిన వారు కోలుకునే రేటు పెరగడంతో పాటు పాజిటివ్ కేసులు రెట్టింపయ్యేందుకు తీసుకునే సమయం పెరుగుతుండటం మహమ్మారి అదుపులోకి వస్తుందనే ఆశలను పెంచుతున్నాయి. కేసులు రెట్టింపయ్యే సమయం ప్రస్తుతం పది రోజులకు పెరిగిందని, లాక్‌డౌన్‌ను సకాలంలో ప్రకటించి సమర్ధంగా అమలు చేయడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
లాక్‌డౌన్‌ను ముందుగా ప్రకటించకపోతే ఇప్పటికి దేశవ్యాప్తంగా 73,000 పాజిటివ్ కేసులు నమోదై ఉండేవని పేర్కొంది. మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల నుంచి రికవరీ రేటు 20.57 శాతానికి పెరగడం సానుకూల పరిణామమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వం చొరవ తీసుకుని దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించి నియంత్రణలు అమలు చేయకపోతే ఇప్పటికి లక్ష కేసులు నమోదయ్యేవని కోవిడ్ సాధికార గ్రూప్ పేర్కొంది. లాక్‌డౌన్‌తో కోవిడ్-19 సంక్రమణ చైన్‌కు అడ్డుకట్ట పడిందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment