న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణలో భాగంగా వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 8.31 కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో 25 కోట్లపైగా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్ పంపిణీలో ప్రపంచంలోనే భారతదేశం టాప్‌లో నిలుస్తుందని పేర్కొంది.
అయితే ప్రస్తుతం కరోనా రెండో దశలో భాగంగా 8 రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాపిస్తోందని వివరించింది. పెరుగుతున్న కరోనా కేసులతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. ఈ పెరుగుతున్న కరోనా కేసులు 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయని, 80.04 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment