24 గంటల్లో 37,418 కరోనా కేసులు | Coronavirus Cases In India Have Crossed 11 Lakh Mark | Sakshi
Sakshi News home page

24 గంటల్లో 37,418 కరోనా కేసులు

Published Tue, Jul 21 2020 9:54 AM | Last Updated on Tue, Jul 21 2020 12:14 PM

Coronavirus Cases In India Have Crossed 11 Lakh Mark - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,418 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 11,55,191కు ఎగబాకింది. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 587 మంది మరణించారు. కోవిడ్‌-19తో ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 28,084 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇక 7,24,578 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 4,02,529 యాక్టివ్‌ కేసులున్నాయని అధికారులు వెల్లడించారు.

మరోవైపు కోవిడ్‌-19 పరీక్షలను ముమ్మరంగా చేపడుతున్నామని సోమవారం 3,30,000కు పైగా శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ పేర్కొంది. జులై 20 వరకూ దేశవ్యాప్తంగా 1,43,81,303 కరోనా టెస్టులు నిర్వహించారని వెల్లడించింది. ఇక ఎన్‌-95 మాస్క్‌ల వాడకంపై ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. వాల్వ్డ్‌ రెస్పిరేటరీలతో కూడిన ఎన్‌-95 మాస్క్‌లను సరిగ్గా వాడకుంటే కరోనా వైరస్‌ సంక్రమణను అడ్డుకోలేరని స్పష్టం చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కంటైన్మెంట్‌ విధానాలకు విరుద్ధమని పేర్కొంది. చదవండి : మైలాన్‌ రెమ్‌డెసివిర్‌ వచ్చేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement