ఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 600 మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో ప్రజలను వైద్యశాఖ మరోసారి హెచ్చరించింది.
తాజాగా వైద్యారోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో 602 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 4,440 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇక, పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
COVID-19 | India reports 602 new cases, 5 deaths in the last 24 hours; Active caseload at 4,440
— ANI (@ANI) January 3, 2024
ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు మంగళవారం నాటికి 312 బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ పేర్కొంది. మొత్తం పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్ వ్యాప్తిని గుర్తించినట్టు స్పష్టం చేసింది. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్‌లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు ఈ వేరియంట్‌కు సంబంధించినవిగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment