సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశంలో విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1486 కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,471కి పెరిగింది. కరోనా బారినపడి బుధవారం 49 మంది మరణించడంతో మృతుల సంఖ్య 652కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య సైతం ఆశాజనకంగా పెరుగుతోంది.
కరోనా కేసుల నుంచి రికవరీ రేటు 19.36 శాతంగా నమోదైంది. 618 మంది రోగులు కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు మెరుగ్గా ఉంది. ఇక ఏప్రిల్ 2న 211 జిల్లాలకు పరిమితమైన వైరస్ ప్రస్తుతం 403 జిల్లాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 45 శాతం కేసులు ఆరు ప్రధాన నగరాల్లోనే వెలుగుచూడటం విశేషం. 3000కి పైగా పాజిటివ్ కేసులతో ముంబై ఈ జాబితాలో ముందుండగా ఢిల్లీలో 2081 కేసులు, అహ్మదాబాద్‌లో 2081, ఇండోర్‌లో 915 కేసులు, పుణేలో 660 కేసులు, జైపూర్‌లో 537 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment