సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారికి అంతానికి గాను అతి త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ అందుబాటులోకి రానున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ‘కో-విన్’ పేరుతో నకిలీ, అక్రమ యాప్‌లు యాప్‌లో స్టోర్‌లో ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని బుధవారం సూచించింది. సదరు యాప్‌ల మాయలోపడి వ్యక్తిగత డేటాను, ఇతర సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపింది. అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని తీవ్రంగా హెచ్చరించింది. (వ్యాక్సిన్ వచ్చేసింది : రిజిస్ట్రేషన్ ఎలా?)
వ్యాక్సిన్ పొందేందుకు కేంద్రం ప్రభుత్వం కోవిన్ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక ప్లాట్‌ఫారమ్‌కు సరిపోలిన నకిలీ యాప్‌లతో అక్రమార్కులు అప్పుడే తమ పని మొదలు పెట్టేశారన్న మాట. కోవిన్ పేరుతో ప్లే స్టోర్‌లో ఇప్పటికే 3 యాప్స్ ఉన్నాయి. వీటిని ఇప్పటికే 10వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ కో-విన్ యాప్ ను అధికారికంగా ఆవిష్కరించినపుడు, విస‍్తృత సమాచారాన్ని అందిస్తామని స్పష్టం చేసింది.
కాగా సీరం రూపొందిస్తున్న కోవీషీల్డ్, భారత్‌బయోటెక్ ఉత్పత్తి చేస్తున కోవాగ్జిన్ వ్యాక్సీన్ల దేశంలో అత్యవసర వినియోగానికి గాను ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. అయితే తొలి దశలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోవిన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ఈ టీకా ప్రక్రియ కోసం ఫ్రంట్‌లైన్ సిబ్బంది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సామాన్య ప్రజానీకానికి ఈ యాప్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
Some apps named "#CoWIN" apparently created by unscrupulous elements to sound similar to upcoming official platform of Government, are on Appstores.
— Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2021
DO NOT download or share personal information on these. #MoHFW Official platform will be adequately publicised on its launch.
Comments
Please login to add a commentAdd a comment