
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. కోవిడ్-19 నుంచి కోలుకుని శుక్రవారం 62,282 మంది రోగులు డిశ్చార్జి కావడంతో దేశవ్యాప్తంగా రికవరీ రేటు 74.30 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక మహమ్మారి బారినపడి మరణించే వారి సంఖ్య కూడా 1.89 శాతానికి దిగివచ్చింది. కోవిడ్-19 నుంచి కోలుకుని ఆస్పత్రులు, హోమ్ ఐసోలేషన్ నుంచి బయటకువచ్చే వారి సంఖ్య పెరగడంతో మొత్తం రికవరీల సంఖ్య 21,58,946కు ఎగబాకింది.
యాక్టివ్ కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 68,898 తాజా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,05,823కు చేరింది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 983 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక టీబీ నిరోధానికి వాడే బీసీజీ టీకా పెద్దల్లో కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది అంచనా వేసేందుకు ఐసీఎంఆర్ ముంబైలో అధ్యయనం చేపట్టింది. ఐసీఎంఆర్ కోసం సేథ్ జీఎస్ మెడికల్ కాలేజ్, కేఈఎం ఆస్పత్రి, బీఎంసీ ప్రజారోగ్య విభాగం సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహిస్తాయని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. చదవండి : డిసెంబరు 3 నాటికి భారత్‌లో కరోనా అంతం!
Comments
Please login to add a commentAdd a comment