సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖను అదనంగా అప్పగించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వైద్యారోగ్య శాఖను సీఎం తన వద్దనే అట్టిపెట్టుకున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ఈటల పలు సభల్లో మాట్లాడుతూ ‘మున్ముందు హరీశ్‌రావుకు కూడా నాకు జరిగిన విధంగానే జరుగుతుంది’ అని ప్రచారం చేశారు. కాగా, ఈ ఆరోపణలను అబద్ధం చేస్తూ హరీశ్‌రావుకు కీలకమైన వైద్యారోగ్య శాఖను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో వైద్య రంగానికి కొత్తరూపునివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో.. వైద్యారోగ్య శాఖను హరీశ్‌రావుకు అదనపు బాధ్యతగా అప్పగించడం గమనార్హం.
చదవండి: (కేసీఆర్‌కు కలిసి రాని ముహూర్తం.. విజయ గర్జన సభ మళ్లీ వాయిదా..)
Comments
Please login to add a commentAdd a comment