
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే పేర్లు నమోదు చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 432 ప్రభుత్వ, 92 ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని, ఆయా ఆస్పత్రుల జాబితాను cowin.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని వెల్లడించింది. 45 నుంచి 59 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు... డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని చూపించాలని, 60 ఏళ్లు దాటిన వారుకూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లబ్ధిదారుల ఫొటో గుర్తింపు కార్డులను పోర్టల్/యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇంకా కొనసాగుతోందని పేర్కొంది.
కాగా, ఏపీలో గత 24 గంటల్లో 20,269 మందికి కరోనా పరీక్షలు కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 51 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటివరకు 8,82,080 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment