సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. డ్రైరన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా వాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన 10 రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని వెల్లడించింది. ఇందుకు గాను ఇప్పటికే 29 వేల కోల్డ్ చైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అలానే దేశవ్యాప్తంగా నాలుగు డిపోలు.. 37 రాష్ట్రాల్లో స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment