Corona Virus Update: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. ప్రభావం మాత్రం కొనసాగుతోంది. గత 25 రోజులుగా వరుసగా లక్షకు దిగువనే కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,396 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
గురువారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 77, 152 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 142 మంది చనిపోగా.. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కరోనాతో 5, 14, 388 మరణాలు నమోదు అయ్యాయి. ఇక ఈ ఏడాది మరణాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది.
2022లో సంభవించిన కరోనా మరణాల్లో బాధితులు చాలామట్టుకు వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నవాళ్లే(vaccination)నని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. తద్వారా కరోనా మరణాల కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకంగా వ్యవహరిస్తోందని, కాబట్టి, అంతా వ్యాక్సిన్ డోసులు వేయించుకోవాలని, నిర‍్క్క్ష్యం పనికిరాదని చెప్తున్నారు. ఇక గురువారం నాటికి దేశవ్యాప్తంగా 178.26 కోట్ల డోసులు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment