సాక్షి,న్యూఢిల్లీ : చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఇక నుంచీ వాడరాదని రాష్ట్రాలను ఐసీఎంఆర్ ఆదేశించింది. చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌లో నాణ్యత లోపించిందని ప్రకటించిన ఐసీఎంఆర్ ఆయా కిట్లను చైనాకు వెనక్కు పంపించాలని రాష్ట్రాలను కోరింది. ఇక దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 1396 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వైరస్ మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 872 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 6185 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది.
మూడు రాష్ట్రాల్లోనే 68 శాతం పాజిటివ్ కేసులున్నాయని పేర్కొంది. కరోనా వైరస్ నుంచి రికవరీ రేటు 22.17 శాతం పెరగడం ఊరట కలిగిస్తోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా 20,835 కేసులు చురుగ్గా ఉన్నాయని చెప్పారు. లాక్‌డౌన్ ఉల్లంఘనులపై రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. రైతులకు కొన్ని సడలింపులు ఇచ్చామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామీణ ఉపాథి హామీ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment