
సాక్షి, ఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వైరస్ విజృంభిస్తోంది. గచిచిన 24 గంటల్లో 55,342 పాజిటివ్ కేసులు నమోదవంతో మొత్తం కేసుల సంఖ్య 71,75,881 కు చేరింది. తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో కరోనా కారణంగా 706 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య1,09,856 కు చేరింది. కరోనా కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఊరట కలిగించే అంశం. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 71,760 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో 62,27,296 మంది కోవిడ్ నుంచి కోలుకోగా ప్రస్తుతం 8,38,729 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ బాధితుల రికవరీ రేటు 86.36 శాతంగా ఉందని తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.10 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.53 శాతానికి తగ్గిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment