‘పొగాకు ఉత్పత్తుల విక్రయంపై నిషేధం’ | Health Minister Harsh Vardhan Seeks Ban On sale of Tobacco Products | Sakshi
Sakshi News home page

బహిరంగ ప్రదేశాల్లో వీటిపై నిషేధం..

Published Fri, May 15 2020 4:05 PM | Last Updated on Fri, May 15 2020 6:09 PM

Health Minister Harsh Vardhan Seeks Ban On sale of Tobacco Products - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు పొగాకు ఉత్పత్తుల విక్రయం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడంపై నిషేధం విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ శుక్రవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ దిశగా రాజస్ధాన్‌, జార్ఖండ్‌ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ మేరకు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.

పొగాకు ఉత్పత్తులను నమిలేవారు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం వల్ల కోవిడ​-19, టీబీ, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు రాసిన లేఖలో హర్షవర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ ఉత్పత్తుల వాడకంతో అపరిశుద్ధ్య వాతావరణం నెలకొని వ్యాధుల వ్యాప్తికి దారితీస్తాయని అన్నారు. ఈ ఉత్పత్తులను విక్రయించే దుకాణాల వద్ద ప్రజలు గుమికూడటం కూడా వ్యాధుల ముప్పును పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నివారించాలని ఐసీఎంఆర్‌ కూడా విజ్ఞప్తి చేసిందని ఆయన గుర్తుచేశారు. చదవండి : లాక్‌డౌన్‌తో 80 శాతం కుటుంబాలు కుదేలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement