
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 55,079 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,02,743 కు చేరింది. తాజాగా 876 మంది కోవిడ్ బాధితులు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య సంఖ్య 51,797 కు చేరింది. ఇప్పటి వరకు 19,77,780 వైరస్ నుంచి కోలుకున్నారు. 6,73,166 బాధితులు ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రికవరీ రేటు 73.18% గా ఉందని తెలిపింది.
(భవిష్యత్‌పై బెంగ.. ఆరోగ్యంపై శ్రద్ధ)
Comments
Please login to add a commentAdd a comment