
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,266 పాజిటివ్ నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,501 కు చేరింది. ఒక్కరోజే 70 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1057 మంది కోవిడ్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 61,529 కు చేరింది. గురువారం ఒక్కరోజే 60,177 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 25,83,948 మంది కరోనా పేషంట్లు కోలుకున్నారు. ప్రస్తుతం భారత్‌లో 7,42,023 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 76.28 శాతంగా ఉందని తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.90 శాతంగా ఉందని, మొత్తం నమోదైన కేసులలో 1.82 శాతానికి మరణాల రేటు తగ్గిందని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా గురువారం 9,01,338 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,94,77,848 చేరిందని వెల్లడించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 కోట్ల మంది కోవిడ్‌బారిన పడగా 8.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
(చదవండి: ‘ఇంటి పనే’ ఇద్దాం!)
Comments
Please login to add a commentAdd a comment