
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 67,151 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 32,34,475 చేరింది. గడిచిన 24 గంటల్లో 1059 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 59,449 కు చేరింది. వైరస్‌బారిన పడ్డవారిలో ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,07,267 యాక్టివ్ కేసులున్నాయి. కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కాగా, దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత్ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
(చదవండి: ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment