దియర్ అల్–బలాహ్ (గాజా స్ట్రిప్): ఇజ్రాయెల్‌తో 13 నెలలుగా సాగుతున్న యుద్ధంలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 44,000 దాటిందని గాజా ఆరోగ్యశాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఇందులో సాధారణ పౌరులు ఎంతమంది, హమాస్‌కు చెందిన వారెందరు అనేది గాజా ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా లెక్కించదు. కాకపోతే మృతుల్లో సగం కంటే ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది.
ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి 44,056 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,04,268 గాయపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. వాస్తవ మృతుల సంఖ్య ఇంకా అధికంగా ఉండొచ్చని, మెడికోలు చేరుకొలేని ప్రదేశాల్లో శిథిలాల కింద చిక్కుకొని అనేక మంది మరణించారని వెల్లడించింది. మరోవైపు 17 వేల మంది పైచిలుకు హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. గత ఏడాది అక్టోబరు ఏడో తేదీన దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడితో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ జరిపిన ఈ మెరుపుదాడిలో 1,200 మరణించగా, 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment