దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది | Lav Agarwal Comments On Corona Virus Today | Sakshi
Sakshi News home page

దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది

Published Fri, Jun 4 2021 5:56 PM | Last Updated on Fri, Jun 4 2021 6:29 PM

Lav Agarwal Comments On Corona Virus Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 6.37 శాతంగా ఉందని వెల్లడించారు. 8 రోజులుగా 2 లక్షలలోపు కరోనా కేసులు నమోదవుతున్నాయని, 5 రాష్ట్రాల్లోనే 66శాతం కేసులున్నాయని అన్నారు. 

కాగా, దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. అయితే కేసుల నమోదులో తగ్గుదల.. పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్‌లో తెలిపింది. 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2713. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,07,071 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,65,97,655 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్‌గా కేసులు 16,35,993 ఉన్నాయి. 24 గంటల్లో20,75,428 మందికి కరోనా పరీక్షలు చేయగా వీటిని కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 35,74,33,846.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement