న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 549 కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 5734కు చేరుకున్నట్లు పేర్కొంది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 17 మంది మృతి చెందినట్లు తెలిపింది. దీంతో దేశంలో కరోనాతో మృత్యువాత పడిన వారి సంఖ్య 166కు చేరినట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment