న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుతో మంచి ఫలితాలు వస్తున్నాయని కేంద్రం సోమవారం వెల్లడించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ప్రతి 3.5 రోజులకు కేసుల సంఖ్య రెట్టింపయ్యేదని ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే, లాక్‌డౌన్ విధించడంతో కేసుల రెట్టింపు కాలం 7.5 రోజులకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, అన్ని వ్యవస్థలూ స్తంభించడంతో వైరస్ వ్యాప్తి రేటులో తగ్గుదల నమోదైందని అన్నారు.
(చదవండి: అనుమతిస్తే ఒత్తిడి తగ్గిస్తాను)
ఇక దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు కేసుల రెట్టింపు విషయంలో మెరుగ్గా ఉన్నాయని అగర్వాల్ తెలిపారు. ఇదిలాఉండగా.. లాక్‌డౌన్ పటిష్ట అమలుతో గోవాలో కొత్త కేసులు నమోదు కాలేదు. పాజిటివ్‌గా తేలిన ఆరుగురు వ్యక్తులు డిశ్చార్చ్ అయ్యారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లోని 59 జిల్లాల్లో 14 రోజుల కాలంలో ఒక్క కొత్త కేసు నమోదు కాలేదు. కర్ణాటకలోని కొడగు, పుదుచ్చేరిలోని మహె, ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్హ్‌వాల్‌లో 28 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు నమోదు లేదు.
Comments
Please login to add a commentAdd a comment