
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు ముమ్మరం చేసింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిషేధిస్తున్న శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. హోలీ, శ్రీరామ నవమి వేడుకల్లో గుమిగూడవద్దని తెలిపింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ రెండు జీవోలు జారీ చేశారు. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు.
కాగా, తెలంగాణలో కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా ఇప్పటి వరకు మొత్తం 1,685 మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 2,99,878 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment