
ప్రతీకాత్మక చిత్రం
బీజింగ్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దాదాపు 400 కోట్ల మాస్కులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లు చైనా అధికారులు ఆదివారం తెలిపారు. మార్చి 1 నుంచి 3.86 బిలియన్ల మాస్కులు, 37.5 మిలియన్ల రక్షణ వస్త్రాలు, 16 వేల వెంటిలేటర్లు, 2.84 మిలియన్ల కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు 50కి పైగా దేశాలకు ఎగుమతి చేసినట్లు అధికారాలు తెలిపారు. వీటి విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొన్నారు.
అయితే చైనా ఉత్పత్తి చేసిన మాస్కులు స్థాయికి తగినట్లు లేవని గతవారం నెదర్లాండ్స్, పిలిప్పీన్స్, క్రొయేషియా, టర్కీ, స్పెయిన్ పలు దేశాలు వాటిని తిరస్కరించాయి. డచ్ ప్రభుత్వం 6 లక్షల మాస్క్‌లను తిప్పి పంపించేసింది. అయితే అవి సర్జికల్ మాస్కులు కాదని తాము ముందే చెప్పినట్లు చైనా వాదిస్తోంది. కాగా, చైనాలో కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కరోనా కట్టడికి అవసరమైన వైద్యపరికరాల ఉత్పత్తి చేసేందుకు స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. (కరోనా దెబ్బ: ప్రపంచం ఉక్కిరిబిక్కిరి)
Comments
Please login to add a commentAdd a comment