డీఐవై మాస్క్‌లు వాడండి: కేంద్ర ఆరోగ్య శాఖ | Central Health Steps Towards Homemade Masks For All People | Sakshi
Sakshi News home page

డీఐవై మాస్క్‌లు వాడండి: కేంద్ర ఆరోగ్య శాఖ

Published Sat, Apr 4 2020 1:32 PM | Last Updated on Sat, Apr 4 2020 1:47 PM

Central Health Steps Towards Homemade Masks For All People - Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మాస్క్‌ల అవసరం అంతకంతకూ పెరిగిపోతోంది. దేశంలో మాస్క్‌ల వినియోగానికి తగ్గ ఉత్పత్తి లేని పరిస్థితుల్లో కొద్దిరోజుల్లో మాస్క్‌ల కొరత వేధించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇంట్లో తయారుచేసిన పునర్వినియోగ మాస్క్‌లను ఉపయోగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది. అనారోగ్య సమస్యలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు లేని వారు ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లను ఉపయోగించాలని పిలుపునిచ్చింది. ( కూల్‌డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌.. ఇద్దరు మృతి!  )

ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పుడు వాటిని కచ్చితంగా ఉపయోగించాలని కోరింది. కరోనా వ్యాప్తి అడ్డుకోవటానికి ఇదెంతో ఉపకరిస్తుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. హెల్త్‌ వర్కర్స్‌, కరోనా బాధితులకు చికిత్స చేసే వారు వీటిని వాడాల్సిన అవసరం లేదని, వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మాస్క్‌లను ధరించాలని స్పష్టం చేసింది.

ఇంట్లోనే పునర్వినియోగ ఫేస్‌ మాస్క్‌లను తయారు చేసుకునే విధానం : 
కావాల్సిన వస్తువులు : ఏదైనా కాటన్‌ వస్త్రం, నాలుగు క్లాత్‌ స్ట్రిప్స్‌, కత్తెర, కుట్టుమిషన్‌

తయారీ పద్ధతి :
 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement