Central Health Ministry
-
నిఫాపై నిరంతర నిఘా
తిరువనంతపురం: ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ రాష్ట్రంలో వెలుగుచూడటంతో కేరళ రాష్ట్రం అప్రమత్తమైంది. నిఫా వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగించేందుకు కావాల్సిన యాంటీవైరల్ ఔషధాలు కేరళకు చేరుకున్నాయని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖతో రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ‘ నిఫాకు ఉన్న ఏకైక యాంటీవైరల్ చికిత్స.. మోనోక్లోనల్ యాంటీబాడీలే. అందుకే వాటిని హుటాహుటిన రాష్ట్రానికి తెప్పించాం. కోజికోఢ్ జిల్లాలో నిఫా వెలుగుచూడడంపై ఆందోళన వద్దు. జిల్లాలోని ప్రజానీకం సరైన నివారణ చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నుంచి గట్టెక్కగలం’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మహిళా మంత్రి వీణ జార్జ్ వ్యాఖ్యానించారు. కోజికోడ్ జిల్లాలో వ్యాపించిన వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇన్షెక్షన్ రేటు తక్కువ ఉన్నాసరే మరణాల రేటు ఎక్కువ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. పుణె నుంచి వైరాలజీ నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపిన విషయం తెల్సిందే. 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు నిఫా సోకడంతో ఇప్పటిదాకా వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మరణించారు. కోజికోడ్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో అన్ని విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. కోజికోఢ్ జిల్లా మాత్రమేకాదు ఇలాంటి ఇన్ఫెక్షన్ల బారిన రాష్ట్రం మొత్తం పడే వాతావరణం అక్కడ ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధనా మండలి ప్రకటించాయని కేరళ సర్కార్ పేర్కొంది. బుధవారం సాయంత్రం నాటికి కోజికోడ్‌లో 11 వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. -
ఆపతరమా..!
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వాయువేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియెంట్ అన్ని రాష్ట్రాల్లోనూ వణుకు పుట్టిస్తోంది. గత కొద్ది రోజుల వరకు దేశంలో పశ్చిమాది రాష్ట్రాల్లో మాత్రమే ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చేవి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో డెల్టా కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. కానీ ఇప్పుడు తూర్పు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ విజృంభణ మొదలైందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఒకే రోజులో 1,41,986 కరోనా కేసులు నమోదయ్యాయి. 222 రోజుల తర్వాత లక్షన్నరకి చేరువలో కేసులు నమోదు కావడంతో ఒమిక్రాన్ ఎంత ప్రమాదకరంగా మారుతోందో అర్థమవుతోంది. కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,72,169కి చేరుకుంది. కేవలం ఒకే రోజులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,00,806 దాటేయడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజువారీ కేసుల పాజిటివిటీ రేటు 9.28శాతం ఉంటే, వీక్లీ పాజిటివిటీ రేటు 5.66శాతంగా ఉంది 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు 3,071కి చేరుకున్నాయి. ఆంక్షలు కఠినతరం చేయాలి: డబ్ల్యూహెచ్ఓ పిలుపు ఆగ్నేయాసియా దేశాల్లో కోవిడ్–19 కేసులు భారీగా వెలుగులోకి వస్తూ ఉండడంతో కఠినమైన ఆంక్షలు విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పిలుపునిచ్చింది. వైరస్ సామాజిక వ్యాప్తిని నివారించడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ప్రజారోగ్య సదుపాయాలను పెంచాలని సూచించింది. ఒమిక్రాన్ వేరియెంట్ తక్కువ తీవ్రత ఉంటుందని భావించి నిర్లక్ష్యం చేయవద్దని డబ్ల్యూహెచ్ఒ ఆగ్నేయాసియ రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ హితవు పలికారు. -
Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రూపాంతరితం దేశంలోకి కూడా ప్రవేశించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ వైరస్‌తో ఇక థర్డ్ వేవ్ తప్పదేమోనన్న భయాలు పెరిగిపోతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వేరియెంట్‌తో ప్రస్తుతానికి మాత్రం ముప్పు లేదని చెబుతోంది. వ్యాక్సిన్ వేసుకొని, కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుందని అంటోంది. కొత్త వేరియెంట్‌తో ప్రజల్లో వచ్చే సందేహాలకు సమాధానాలిచ్చే ప్రయత్నం కేంద్ర ఆరోగ్య శాఖ చేసింది. అవేంటో చూద్దాం. థర్డ్ వేవ్ వస్తుందా ? ఒమిక్రాన్ కేసులు కొన్ని రెట్ల వేగంతో పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వేరియెంట్లో తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదు. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉండడం, డెల్టా వైరస్ కారణంగా యాంటీ బాడీలు అత్యధికుల్లో వృద్ధి చెందాయని సెరో సర్వేల్లో తేలడంతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే ఈ విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనాకి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ పాటించాలి. మాస్కు కచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకపోతే తప్పనిసరిగా వేయించుకోవాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానాలి. గాలి , వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఒమిక్రాన్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పని చేస్తాయా ? ప్రస్తుతం లభిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియెంట్‌ని అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. వైరస్ కొమ్ము జన్యువుల్లో చోటు చేసుకున్న కొన్ని మార్పుల కారణంగా టీకా సామర్థ్యం తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు, కరోనా సోకిన వారిలో ఏర్పడిన యాంటీబాడీలతో కణజాలంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఇంకా కొనసాగుతుంది. అయితే వ్యాధి తీవ్రతని తగ్గించడానికి తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒమిక్రాన్ ఎంత ఆందోళనకరం ? వైరస్‌లో వస్తున్న మార్పులు, ఎంత వేగంతో వ్యాప్తి చెందుతుంది, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం, రీ ఇన్ఫెక్షన్లు వంటివాటిపై అంచనాలన్నింటినీ క్రోడీకరించి ఈ వైరస్‌ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. కరోనా వైరస్ ఉన్నంతకాలం జన్యుమార్పులు, కొత్త రూపాంతారితాలు పుట్టుకురావడం సాధారణంగా జరిగేదే. సాధారణంగా వేరియెంట్లలో ఎక్కువ శాతం ప్రమాదకరం కాదు. ఎక్కువజన్యు మార్పులు జరిగిన వైరస్ బలహీన పడుతుంది. ఒమిక్రాన్ ఆ కోవలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
మరో 14,348 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,46,157కు చేరుకుంది. ప్రస్తుతం 1,61,334 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. కరోనా వల్ల మరో 805 మంది మృతిచెందారు. దీంతో కరోనా సంబంధిత మరణాల సంఖ్య 4,57,191కు ఎగబాకింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0.47 శాతం ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.19 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా 3,36,27,632 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. -
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,647 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 354 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,35,110 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 39,486 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: ఆస్తులు లాగేసుకుని బయటకు గెంటేశారు ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,17,20,112 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,19,551 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,24,74,773 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 58,89,97,805 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.68 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మహిళలతో చనువుగా ఫోన్ చేయించి అర్ధనగ్న ఫొటోలు.. -
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,072 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 389 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,34,756 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 44,157 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,16,80,626 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,33,924 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,24,49,306 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 57.6 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.57శాతంగా ఉంది. కాగా దేశంలో ఇప్పటి వరకు 50,75,51,399 మందికి కోరోనా పరిక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 437 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,32,079 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 36,830 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,14,48,754 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,69,846 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,22,50,679 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 55,47,30,609 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.51శాతంగా ఉంది. ఇక దేశంలో ఇప్పటి వరకు 49,66,29,524 మందికి కోరోనా పరిక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
దేశంలో ఇప్పటివరకు 49 కోట్ల మందికిపైగా వ్యాక్సినేషన్: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 49 కోట్ల మైలు రాయి దాటింది. ఒక్క జులైలోనే 13 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రాలు, యూటీల వద్ద ఇంకా అందుబాటులో 3 కోట్లకుపైగా వ్యాక్సిన్లు నిల్వ ఉన్నట్లు తెలిపింది. దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3 కోట్లకు పైగా కోలుకున్నట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు కోలుకున్నవారు 95 శాతం పైనే ఉన్నారని పేర్కొంది. గత నెల రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కనిపిస్తోంది. తెలంగాణలో 2.2 కోట్ల మంది టీకాలకు అర్హులు ఉండగా, వీరిలో 1.12 కోట్ల మందికి ఇప్పటి వరకు సింగల్ డోస్ వేయగా, 33.79 లక్షల మందికి రెండు డోస్‌లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. -
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 541 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,24,351.మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 39,258 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,08,20,521 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4,10,952 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3.16 కోట్ల మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 47,02,98,596 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
46 జిల్లాల్లో మళ్లీ కరోనా ఉధృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 10 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ ఉధృతమవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో గత కొన్ని వారాలుగా కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతోందని వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఆయా జిల్లాల్లో ఆంక్షలను కఠినతరం చేయాలని, జనం గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, సామూహిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని సూచించింది. మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్య నమోదవుతోందని పేర్కొంది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు తెలియజేసింది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాల్లో నిర్లక్ష్యం వీడకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 80 శాతానికి పైగా ఐసోలేషన్‌లోనే.. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా 10 రాష్ట్రాల్లో కరోనా తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రాలు కోవిడ్ కేసుల్లో పెరుగుదలను లేదా పాజిటివిటీ పెరుగుదలను రిపోర్ట్ చేస్తున్నాయి. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ నియంత్రణ చర్యల గురించి చర్చించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజీ, వెంటిలేటర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల అందుబాటుపై సమీక్షించారు. ఈ 10 రాష్ట్రాల్లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెప్పారు. 10 రాష్ట్రాల్లో 80 శాతానికి పైగా కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఒకవేళ బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించి, ఆసుపత్రుల్లో చేర్చి వైద్య సేవలందించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే అధికారులు అందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించండి కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే అధికంగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. కరోనా వ్యాక్సినేషన్‌ను సంతృప్తికర స్థాయిలో నిర్వహించడం ద్వారా ఆయా జిల్లాల్లో ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని వివరించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొంది. పీఎస్ఏ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలివ్వాలని తెలిపింది. జిల్లాల వారీగా సొంతంగా సెరో–సర్వేలు నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ల ఉనికిని గుర్తించేందుకు ఇన్సకాగ్ (ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సార్టియం) ల్యాబ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని పేర్కొంది. వ్యాక్సినేషన్లో వయోధికులకు ప్రాధాన్యం: ఐసీఎంఆర్ కొత్తగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో 80 శాతం మంది 45–60 ఏళ్లలోపు వారేనని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. అందుకే కరోనా వ్యాక్సినేషన్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. సామూహిక వేడుకలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రజలకు హితవు పలికారు. ప్యాకేజీ నుంచి రాష్ట్రాలకు రూ.1,827 కోట్లు విడుదల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుర్చడానికి కేంద్ర సర్కారు కోవిడ్–19 ఎమర్జెన్సీ రెస్పాన్స్, హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్నెస్(ఈసీఆర్పీ–2) పేరిట ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఈ ప్యాకేజీ కింద రూ.12,185 కోట్లు కేటాయించింది. తాజాగా ఇందులో 15 శాతం.. అంటే రూ.1,827.8 కోట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయా తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.281.98 కోట్లు, బిహార్‌కు రూ.154 కోట్లు, రాజస్తాన్‌కు రూ.132 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.131 కోట్లు ఇచ్చారు. -
దేశంలో కొత్తగా 41,649 కరోనా కేసులు.. మరణాలు 593
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,649 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 593 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,23,810 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 37,291 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,07,81,263 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 4,08,920 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 31,613,993 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 45,60,33,754 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,654 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 640 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,22,022 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 41,678 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,06,63,147 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,99,436 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 31.48 కోట్ల మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 44.61 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
దేశంలో కొత్తగా 29,689 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,689 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 415 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,21,382 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 42,363 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,06,21,469 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,98,100 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3.14 కోట్ల మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 44,19,12,395 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
కరోనా సోకినవారు టీబీ పరీక్ష చేయించుకోండి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా, టీబీ రోగులకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకినవారు టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. టీబీ రోగులంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. కాగా, భారతీయ చిన్నారులు కీలకమైన కోవిడ్ టీకాను పొందలేకపోతున్నారనే వార్తలపై కేంద్ర ఆరోగ్యం శాఖ శనివారం స్పందించింది. అన్ని రాష్ట్రాలతో కోవిడ్ నెగిటివ్ ప్రభావాలను తగ్గించే చర్యలపై నిరంతరం చర్చిస్తున్నామని తెలిపింది. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ టీకాలు అందిస్తామని భరోసా ఇచ్చింది. ప్రపంచంలో భారత్‌లోనే అత్యధికంగా టీకా పొందని పిల్లలున్నారని, వీరి సంఖ్య సుమారు 35 లక్షలని యూనిసెఫ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. కరోనా ఆరంభం నుంచి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది. 2021 తొలి త్రైమాసికానికి దేశంలో 99 శాతం డీటీపీ3 కవరేజ్ చేశామని తెలిపింది. సార్వత్రిక టీకా ప్రోగ్రామ్‌లో భాగంగా అందరికీ టీకాలు తప్పక అందిస్తామని తెలిపింది. -
దేశంలో ఇప్పటివరకు 38.60 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 38.60 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించగా.. ఓ వైపు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా, మరో వైపు పలు రంగాలు కుదేలవగా, కొందరు ఉపాధులు కోల్పోయారు. చివరకు వైరస్‌తోనే గాక ఆకలితోనూ పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మాత్రమే మార్గమని కేంద్రం నిర్ణయించుకుని వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలో ప్రస్తుత వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు సుమారు 35 కోట్లకు పైగా టీకాలను రాష్ట్రాలకు, యూటీలకు సరఫరా చేసినట్లు తెలిపింది. వీటికి అదనంగా రాష్ట్రాలకు మరో 11.25 లక్షల కోవిడ్ టీకా డోసులు పంపే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల వద్ద ఇప్పటికే 1.44 కోట్ల కోవిడ్ టీకా డోసుల నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సార్వత్రికీకరణ జూన్ 21 నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్త టీకా డ్రైవ్‌లో భాగంగా, భారత ప్రభుత్వం రాష్ట్రాలు, యూటీలకు కోవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తోంది. ఈ క్రమంలో దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్రం ఉచితంగా సరఫరా చేస్తుందని తెలిపింది. తాజా డేటా ప్రకారం.. వినియోగించిన వ్యాక్సిన్ల డోసుల సంఖ్య వ్యర్థాలతో సహా కలిపి 37,16,47,625 డోసులని వెల్లడించింది. -
Mansukh Mandaviya: కొత్త ఆరోగ్య మంత్రికి ట్రోల్స్ వెల్కమ్
ఈరోజుల్లో చదువుతో సంబంధం ఏముందిలే అని చాలామంది అనుకోవచ్చు. కానీ, ఆ అర్హతనే ఆధారంగా చేసుకుని విమర్శిస్తున్న రోజులివి. ముఖ్యంగా రాజకీయాల్లో నేతల ఎడ్యుకేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది. అలాంటిది.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆఫీస్‌లో అడుగుపెట్టిన మన్షుక్ లక్ష్మణ్ మాండవీయకు ట్రోల్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. అందుకు కారణం.. ఆంగ్ల భాషలో ఆయన పరిజ్ఞానం చర్చకు రావడమే. గతంలో ఆయన చేసిన కొన్ని ట్వీట్లలో ఆంగ్లపు అక్షర దోషాలు ఉన్నాయి. మామూలుగా ఒకటి రెండు స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉంటే ఫర్వాలేదు. కానీ, ఏకంగా అర్థం మారిపోయేట్లుగా ఉండడం, కొన్ని చోట్ల స్పెల్లింగ్‌లు దారుణంగా ఉన్నాయి. Tray and tray will be success . — Mansukh Mandaviya (@mansukhmandviya) January 9, 2014 Mr. Rahul Ji, great grand son of Mahatma Gandhi already wrote you that RSS was not at all responsible for death of Gandhiji — Mansukh Mandaviya (@mansukhmandviya) March 10, 2014 ఇక అందుకు సంబంధించి స్రీ్కన్ షాట్స్ కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎంత వరకు ఫేక్ ఉన్నాయో తెలియదు కానీ.. ఒకటి రెండు మాత్రం ఆయన ఒరిజినల్ అకౌంట్‌కు చెందినవే కావడంతో.. మొత్తం నిజమై ఉంటాయని భావిస్తున్నారు. మరికొన్ని డిలీట్ అయి ఉన్నాయి. ఇక గుజరాత్‌కు చెందిన మన్షుక్ మాండవీయ.. ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసినట్లు ఆయన ప్రొఫైల్‌లో ఉంది. మరోవైపు బీజేపీ నేతలు, అభిమానులు మాత్రం మంత్రికి సపోర్ట్‌గా రీట్వీట్లు చేస్తున్నారు. He is our Health of Minister (#MansukhEnglish)🤦🙄#दर्जासमजूनघ्या #mansukhmandaviya @ShivsenaComms #CabinetReshuffle2021 #CabinetExpansion2021 pic.twitter.com/R8tpbEVd4I — 𝐏𝐫𝐚𝐭𝐢𝐤 𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚 𝐊𝐚𝐥𝐚𝐬𝐤𝐚𝐫 (@PratiKkalaskar_) July 8, 2021 Several yers back i applied for a job They canceled me because of my Vary good ingles accent... Today me is halth Minister of the Entire duniya 😌#CabinetReshuffle#MansukhEnglish#MansukhMandviya#englishfans — Mansukh मंद | वाया Parody (@PranavThe2nd) July 7, 2021 Mansukh Mandaviya is our Health of Minister pic.twitter.com/mpYMEgI0DQ — Joy (@Joydas) July 7, 2021 -
Vaccination: మనమే నంబర్ 1..!
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సినేషన్ విషయంలో భారత్ అమెరికా రికార్డును దాటేసింది. దేశంలో ఇప్పటివరకు 32.36 కోట్ల డోస్‌లను అందించారు. కాగా మన దేశం కంటే సుమారు ఒక నెల ముందు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన అమెరికాలో ఇప్పటివరకు 32.33 కోట్ల మందికి వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చారు. భారత్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ ఏడాది జనవరి 16వ తేదీన ప్రారంభంకాగా, అమెరికాలో 2020 డిసెంబర్ 14న మొదలైంది. కాగా, యూకేలో గతేడాది డిసెంబర్ 8న, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో డిసెంబర్ 27న వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను ప్రారంభించారు. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 32,36,63,297 టీకా డోస్‌లు ఇచ్చారు. దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో భారత్ ఈ రికార్డు సాధించింది. దేశంలో ఇప్పటివరకు 5.6% మందికి వ్యాక్సిన్ డోస్‌లను అందించగా, అమెరికా జనాభాలో 40% కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేశారు. గత వారం 3 కోట్ల 91 లక్షల మందికి వ్యాక్సిన్ డోస్‌లను భారత్ ఇచ్చింది. ఇది ఒక మైలురాయి అని ఆరోగ్య శాఖ తాజాగా ట్విట్టర్లో పేర్కొంది. కెనడా, మలేసియా వంటి దేశాల జనాభా కంటే ఎక్కువ మందికి ఒక వారంలోనే వ్యాక్సిన్లు అందించారు. కరోనా వైరస్‌కు కారణంగా పరిగణిస్తున్న చైనా, ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్లు వేసింది. చైనా ప్రభుత్వం ప్రకారం, దేశంలో 117 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. 22.3 కోట్ల మంది ప్రజలు రెండు డోస్‌లను తీసుకున్నారు. అయితే, చైనా ప్రభుత్వం అందించే డేటాను ప్రపంచం విశ్వసించట్లేదు. అందువల్ల ఈ డేటాను ఎక్కడా చేర్చలేదు. ఇప్పటివరకు అక్కడ 91 వేల కరోనా కేసులు మాత్రమే గుర్తించారు. అదే సమయంలో అమెరికాలో ఈ సంఖ్య 3 కోట్లకు చేరుకుంది. కరోనాకు సంబంధించి చైనా నమోదుచేసిన డేటాను ప్రపంచదేశాలు అనుమానాస్పదంగానే పరిగణిస్తున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్ 12 దేశాలలో ఆందోళన కలిగిస్తోందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో దేశంలోని 12 రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. 76 రోజుల్లోనే అతి తక్కువ మరణాలు దేశంలో గత 24 గంటల్లో 46,148 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 21రోజులుగా లక్ష కన్నా తక్కువగా రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక్క రోజు వ్యవధిలో వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 76 రోజుల్లోనే అతి తక్కువగా నమోదైన 979 మరణాలతో మొత్తం బాధిత మృతుల సంఖ్య 3,96,730కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,72,994గా ఉంది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు మరో 13,409 తగ్గాయి. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 1.89 శాతం మాత్రమేనని కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ ఊపందుకుంటోంది: ప్రధాని మోదీ దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ‘అందరికీ టీకా, అందరికీ ఉచితంగా’ విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీల కంటే ఎక్కువ టీకాలు ఇచ్చిన దేశంగా భారత్ అవతరించిన నేపథ్యంలో ట్విట్టర్లో ప్రధాని ఈ మేరకు స్పందించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాలుపంచుకుంటున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు.. మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,258 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,95,751 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 57,944 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,92,51,029 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 5,86,403 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,02,33,183 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: ఆక్సిజన్ డిమాండ్‌పై రగడ: బీజేపీ, ఆప్ పరస్పరం విమర్శలు -
దేశంలో 50 వేల దిగువన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,698 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,183 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,94,493 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 64,818 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,91,93,085 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 5,95,565 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,01,83,143 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం 31.5 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్ -
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,329 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,93,310 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 64,527 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,91,28,267 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,12,868 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,01,34,445 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 30,79,48,744 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గత 24 గంటల్లో 17,35,781 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 39,95,68,448 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల్ని కట్టడి చేయాలి -
Coronavirus: దేశంలో తగ్గిన కొత్త కేసులు.. పెరిగిన రికవరీలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 54,069 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,321 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,91,981 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 68,885 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,90,63,740 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,27,057 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,00,82,778 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 30,16,26,028 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గత 24 గంటల్లో 18,59,469 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 39,78,32,667కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: తిరుచ్చి ఎయిర్‌పోర్టులో 8.5 కిలోల బంగారం పట్టివేత -
30 కోట్లు దాటిన వ్యాక్సినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో మైలరాయి దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 39,49,630 శిబిరాల ద్వారా ఇప్పటిదాకా మొత్తం 30,09,69,538 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరగగా, గత 24 గంటలలోనే 63.26లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. అదే సమయంలో గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 50,848 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటిదాకా కరోనా బారినపడిన వారి సంఖ్య మూడు కోట్లు (3,00,28,709) దాటింది. గత ఏడాది డిసెంబరు 19న కోటి దాటిన కరోనా కేసులు... మే 4న 2 కోట్లకు (136 రోజులు పట్టింది) చేరాయి. 2 నుంచి 3 కోట్లకు చేరడానికి మాత్రం 50 రోజులే పట్టడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,43,194 యాక్టివ్ కేసులు ఉండగా, ఇది గత 82 రోజుల్లో అత్యల్పంగా నమోదైంది. 41 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు 2,89,94,855 మంది కాగా గత 24 గంటలలో 68,817 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 96.56 శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 19,01,056 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరగగా, ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 39.59 కోట్లకు పైగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ 2.67%గా నమోదు అయ్యింది. భారత్‌లో 40 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఆందోళనకరమైన వేరియంట్(వీఓసీ)గా భావిస్తున్న కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ (బి.1.617.2.1/ఏవై.1) భారత్‌లో నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 40 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో ఈ వేరియంట్ ఉనికి ఎక్కువుంది. డెల్టాతోపాటు డెల్టా ఉపవర్గానికి చెందిన అన్ని వేరియంట్లు ఆందోళనకరమైనవిగా గుర్తించినట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 45 వేలకుపైగా నమూనాలను(శాంపిల్స్) పరీక్షించగా, మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 40 పాజిటివ్ కేసులు బయటపడినట్లు పేర్కొంది. డెల్టా ప్లస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు సూచించినట్లు తెలిపింది. కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో జరిగిన కే417ఎన్ మ్యుటేషన్‌ను డెల్టా ప్లస్ వేరియంట్‌గా (బి.1.617.2.1/ఏవై.1) వర్గీకరించారు. -
దేశంలో తగ్గిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,358 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 68,817 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,89,94,855 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,43,194 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,00,28,709 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 54,24,374 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 29,46,39,511కు చేరుకుంది. గత 24 గంటల్లో 19,01,056 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 96.56 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: హైవేలో లారీ పార్క్ చేస్తే అంతే..! -
Coronavirus: దేశంలో తగ్గిన కొత్త కేసులు.. పెరిగిన రికవరీలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,167 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,89,302 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 81,839 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,89,26,038 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,62,521 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పటివరకు 28.87 మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్.. ప్రాణాలు గాల్లో.. -
సెకండ్ వేవ్ ముగిసినట్లేనా?
న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటులో భారత్ ముఖ్యమైన మైలురాయిని దాటింది. దేశంలో వరుసగా 14వ రోజు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువే నమోదయ్యింది. అంటే ప్రతి 100 టెస్టుల్లో 5 శాతంలోపే పాజిటివ్‌గా తేలుతున్నాయి. వ్యాప్తి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. అయితే, పరిస్థితి ఆశాజనంగా మారినట్లు ఇప్పుడే నిర్ణయానికి రావొద్దని సైంటిస్టులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనాలో కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని, జాగ్రత్తలు కొనసాగించక తప్పదని సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న కరోనా గణాంకాలను నమ్మలేమని అంటున్నారు. ఇంకా సమయం ఉంది ‘సెకండ్ వేవ్ ముగింపు ఇప్పుడే కాదు. డెల్టా ప్లస్ లాంటి వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి కాబట్టి ఈ వేవ్ అంతం కావడానికి ఇంకా సమయం ఉంది’ అని ఢిల్లీలోని శివనాడార్ వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ నాగసురేష్ వీరపు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫస్టు వేవ్ ముగిసిందన్న భావనతో జనం నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇంతలోనే సెకండ్ వేవ్ విరుచుకుపడిందని గుర్తుచేశారు. ఫస్ట్‌వేవ్‌లో పాజిటివిటీ రేటు ఒక శాతంగా ఉన్నప్పుడు సెకండ్ వేవ్ మొదలైందన్నారు. కేసుల సంఖ్య తగ్గింది అంటే సెకండ్ వేవ్ ముగిసినట్లు కాదని చెప్పారు. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న కరోనా బాధితులు కొందరు పరీక్షలు చేయించుకోవడం లేదని గుర్తుచేశారు. రోజువారీ కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తుండడానికి ఇది కూడా ఒక కారణమని పేర్కొన్నారు. దేశమంతటా పాజిటివిటీ రేటు తగ్గితేనే.. దేశంలో కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే అధికంగా ఉందని ఢిల్లీకి చెందిన వైద్య నిపుణుడు చంద్రకాంత్ లహరియా తెలిపారు. రోజువారీ పాజిటివ్ కేసులు అధికంగా∙నమోదవుతున్నాయన్నారు. దేశమంతటా అన్ని ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తగ్గేదాకా వేచిచూడాలని, ఇది రెండు వారాల కంటే ఎక్కువ రోజులు కొనసాగితేనే సెకండ్ వేవ్ అంతమవుతున్నట్లు గుర్తించాలన్నారు. కేరళలో ఆదివారం పాజిటివిటీ రేటు 10.84 శాతం నమోదు కావడం గమనార్హం. -
ఒక్క రోజులో 85 లక్షల టీకాలు!
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలి రోజే దేశం మొత్తం మీద ప్రజలకు 85.15 లక్షలకు పైగా టీకా డోసులిచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజులో ఇన్ని టీకాలు ఇవ్వడం ఇదే ప్రథమమని ప్రకటించింది. జనవరి 16న ఆరంభమైన భారత కోవిడ్ టీకా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 28.36 కోట్లమందికి పైగా టీకాలందుకున్నారని కోవిన్ పోర్టల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘కోవిడ్‌పై పోరులో టీకానే మన బలమైన ఆయుధం. టీకా అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ధన్యవాదాలు. వెల్డన్ ఇండియా’ అని ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. గతంలో సింగిల్డే టీకా రికార్డు ఏప్రిల్ 1న రికార్డయింది. ఆరోజు 48 లక్షల టీకా డోసులు అందించారు. . సోమ వారం అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో టీకాలివ్వగా, అనంతర స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. అందరికీ ఉచిత టీకా జూన్ 7న ప్రభుత్వమే 18 ఏళ్ల పైబడిన అందరికీ టీకాలనిస్తుందని ప్రధాని ప్రకటించారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ఆరంభమైంది. ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కరోనాపై పోరును బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో దేశ యువత, మధ్యతరగతి, పేద ప్రజానికం లబ్ది పొందుతారని ఆయన ట్వీట్ చేశారు. ప్రజా భాగస్వామ్యంతోనే కోవిడ్‌పై పోరును భారత్ బలోపేతం చేస్తుందన్నారు. టీకాలపై వాస్తవాలు తెలుసుకోవాలని, అనవసర పుకార్లు నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద ఉచిత టీకా కార్యక్రమం’’గా పేర్కొంటున్న ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18ఏళ్ల పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అందరం కలిసి ఉమ్మడిగా కరోనాను జయిద్దామని ప్రధాని అభిలషించారు. దేశీయ ఉత్పత్తిదారుల నుంచి 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రమే సమీకరించనుంది. మిగిలిన ఉత్పత్తిని ప్రైవేట్ ఆస్పత్రులకు ఉత్పత్తి సంస్థలు విక్రయించుకోవచ్చు. -
88 రోజుల తర్వాత.. 50 వేలకు చేరువలో కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,422 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,88,135 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 78,190 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,844,199 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,02,887 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 28,00,36,898 మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: ఈ భూమిపై మాకింత చోటేది? -
81 రోజుల తర్వాత.. 50 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. 81 రోజుల తర్వాత కనిష్ట స్థాయిలో కరోనా కేసులు నయోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,576 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,86,713 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 87,619 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,87,66,009 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,29,243 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 2,98,81,965 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో ఇప్పటివరకు 27.66 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: కరోనా మృతులకు రూ. 4 లక్షల పరిహారం.. సుప్రీంకోర్టుకు కేంద్రం -
దేశంలో పెరిగిన కరోనా కేసుల రికవరీలు.. తగ్గిన మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో 73 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసులు 8 లక్షల దిగువకు నమోదయ్యాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,587 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 7,98,656 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.03 శాతం. కాగా, మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 26.89 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: జేఎన్‌యూ విద్యార్థి నేతల విడుదల -
దేశంలో మళ్లీ స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే నిన్నటితో పోల్చితే.. దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,330 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి దేశంలో మొత్తం 3,81,903 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,03,570 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,84,91,670 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 8,26,740 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 19,31,249 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 38,52,38,220కు చేరుకుంది. ఇక దేశంలో ఇప్పటివరకు 26,55,19,251 మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: ఇంజనీరింగ్ చదివారు.. గంజాయి అమ్ముతూ బుక్కయ్యారు! -
పెద్దల ఔషధాలు పిల్లలకు వద్దు
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సలో భాగంగా పెద్దలకు ఇస్తున్న కొన్నిరకాల ఔషధాలను పిల్లలకు కూడా ఉపయోగిస్తున్నారని, ఇలా చేయడం సరైంది కాదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా మూడో వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో చిన్నారుల కోవిడ్–కేర్ సేవల విషయంలో బుధవారం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరావిర్ వంటి డ్రగ్స్, డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్ వంటి యాంటీబయాటిక్స్‌ను పిల్లలకు ఇవ్వొద్దని ప్రతిపాదించింది. వీటిని కరోనా బారినపడిన పెద్దల కోసమే ఉపయోగించాలని గతంలోనే సూచించినట్లు గుర్తుచేసింది. వైరస్ సోకిన పిల్లలకు చికిత్స అందించడంలో అలసత్వం పనికిరాదని, తగిన మౌలిక సదుపాయాలను ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఇప్పుడున్న సదుపాయాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపింది. ఎలాంటి అనూహ్య పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు ► ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు కరోనా సులభంగా సోకే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలకు సైతం కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక అలాంటివారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ► కరోనా చికిత్సలో పెద్దలకు ఉద్దేశించిన ఔషధాలను పిల్లలపై ప్రయోగించకూడదు. వాటిని పిల్లల కోసం సిఫార్సు చేయలేదు. ► భవిష్యత్తులో కరోనా పాజిటివ్ కేసులు పెరిగితే.. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసికట్టుగా పనిచేయాలి. ► లాక్డౌన్లు పూర్తిగా ఎత్తివేశాక, పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరిచాక ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ► జిల్లాల్లో కరోనా సెకండ్ వేవ్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు నమోదైన రోజువారీ కేసుల ఆధారంగా థర్డ్‌వేవ్‌లో ఎంతమంది పిల్లలకు కరోనా సోకనుందో, వారిలో ఎంతమంది ఆసుపత్రుల్లో చేరుతారో అంచనాకు రావొచ్చు. దీనిప్రకారం కరోనా బాధిత పిల్లల సంరక్షణ కోసం ఆసుపత్రుల్లో అదనపు పడకలు ఏర్పాటు చేయాలి. ► సుశిక్షితులైన వైద్యులు, నర్సులను నియమించుకోవాలి. వైద్య సిబ్బంది విషయంలో కొరత రాకుండా జాగ్రత్తపడాలి. ► పిల్లల ఆసుపత్రుల్లో కరోనా బాధిత చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుండాలి. పిల్లలకు కరోనా చికిత్స అందిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులను కూడా అనుమతించవచ్చు. ► పిల్లలకు కరోనా సోకినప్పటికీ చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కొందరిలో స్వల్ప లక్షణాలే బయటపడుతున్నాయి. ఇలాంటివారు ఇంట్లోనే తల్లిదండ్రుల సంరక్షణలోనే కోలుకుంటున్నారు. లక్షణాలున్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు భావిస్తే ఆసుపత్రికి తరలించాలి. ► ఇంట్లో చికిత్స పొందుతున్న కరోనా బాధిత చిన్నారులకు ఆశా వర్కర్ల సేవలు అవసరం. -
దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే మంగళవారంతో పోల్చితే.. దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,542 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,79,573 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,07,628 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,83,88,100 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 8,65,432 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 28,00,458 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 26.19 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: Coronavirus: దేశంలో తగ్గిన కరోనా తీవ్రత -
పిల్లలపై కరోనా ప్రభావం స్వల్పమే
న్యూఢిల్లీ: రెండో వేవ్‌లో పిల్లలు, యువత అధికంగా ప్రభావితమయ్యారన్న వాదనను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. 1 నుంచి 20 ఏళ్లలోపు వారిపై కరోనా వైరస్ ప్రభావం చాలా స్వల్పమేనని ప్రకటించింది. ఫస్ట్ వేవ్ బాధితుల్లో 1–10 వయసు పిల్లలు 3.28 శాతం, సెకండ్ వేవ్‌లో 3.05 శాతం మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఫస్ట్ వేవ్‌లో కరోనా సోకినవారిలో 11–20 వయస్కులు 8.03 శాతం, సెకండ్ వేవ్‌లో 8.57 శాతం మంది ఉన్నారని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. మే 7న గరిష్ట సంఖ్యలో రోజువా కేసులు నమోదయ్యాయని, ఇప్పుడు 85 శాతం పడిపోయాయని గుర్తుచేశారు. ఇండియాలో 2020లో జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకూ కోవిడ్–19 ఫస్ట్ వేవ్ కొనసాగింది. అప్పుడు మొత్తం బాధితుల్లో 1–20 వయసున్న వారు కేవలం 11.31 శాతం. అలాగే రెండో వేవ్ ఈ ఏడాది మార్చి 15 నుంచి మే 25 దాకా ప్రభావం చూపింది. ఈ 2 నెలల 10 రోజుల్లో కరోనా బారినపడిన వారిలో 1–20 వయస్కులు కేవలం 11.62 శాతం మాత్రమే. కరోనా సోకిన పిల్లలు, యువత సంఖ్య విషయంలో అంటే రెండు వేవ్‌ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని ప్రభుత్వ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఒకటి, రెండు వేవ్‌ల్లో కలిపి సగటున 11.46 శాతం మంది పిల్లలు, యువత కరోనా బారినపడ్డారు. ఫస్ట్ వేవ్ (2020 జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు) సెకండ్ వేవ్ (2021 మార్చి 15 నుంచి మే 25 వరకు) చదవండి: ఆర్నెల్లు సమస్యలు వేధిస్తాయి -
దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. 75 రోజుల తర్వాత కరోనా కేసులు 70 వేలకు దిగొచ్చాయి. తాజాగా గత 24 గంటల్లో భారత్‌లో 70,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 3,921 మంది కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. ఇక 1,19,501 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు దేశంలో 2,81,62,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 9,73,158 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 14,92,152 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య 37,96,24,626కు చేరింది. ఇక ఇప్పటి వరకు 25.48 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: నెగిటివ్ రిపోర్టు వద్దనేసరికి రోడ్లన్నీ జామ్! -
దేశంలో లక్షకు దిగొచ్చిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు రెండు నెలల తరువాత కోవిడ్ కేసులు లక్షకు దిగొచ్చాయి. గత 24గంటల్లో భారత్‌లో 1,00,636 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,427 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్ పాజిటివ్ తేలగా.. 3,49,186 మంది కోవిడ్ బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 కరోనా పాజిటివ్ బాధితులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు 23.27 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. (చదవండి: పాకిస్తాన్లో ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి) -
రెండు నెలల కనిష్టానికి.. !
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్రమణ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పాజిటివ్ కేసుల నమోదులో రోజురోజుకూ తగ్గుదల కనిపిస్తోంది. శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటలలో 1,20,529 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. ఇది గత 58 రోజులలో అత్యల్పం. వరుసగా 9 రోజులుగా... రోజుకు 2 లక్షలలోపే కేసులు నమోదవుతున్నాయి. కాగా దేశంలో గత 24 గంటల్లో 3,380మంది కరోనాతో మరణించడంతో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,44,082కు చేరింది. యాక్టివ్ కేసులూ క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,55,248గా ఉంది. గత 5 రోజులుగా ఈ సంఖ్య 20 లక్షలలోపే ఉంది. యాక్టివ్ కేసులు 5.42% తగ్గాయి. వరుసగా 23 రోజులు రికవరీలే ఎక్కువ వరుసగా 23వ రోజు కరోనా కొత్త కేసులకంటే కొత్త రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉంది. గత 24 గంటలలో 1,97,894 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా కోవిడ్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 2,67,95,549కు చేరింది. దీంతో రికవరీ రేటు 93.38% కి పెరిగింది. దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండగా వారపు పాజిటివిటీ తగ్గుతున్న ధోరణి కనబడుతోంది. ప్రస్తుతం వారపు పాజిటివిటీ 6.89% కాగా రోజువారీ పాజిటివిటీ 5.78% గా నమోదైంది. 12 రోజులుగా ఇది 10% లోపే ఉంటూ వస్తోంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 22.78 కోట్లు దాటింది. -
హమ్మయ్య.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. గత నెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు 1.32 లక్షలకు చేరుకున్నాయి. అదే సమయంలో గత 5 రోజుల్లో దేశంలో 6,79,550 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 11,43,335గా నమోదైంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24 గంటల్లో 1,32,364 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది. మే 7వ తేదీన నమోదైన అత్యధిక కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం పాజిటివ్ కేసులు 68% వరకు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో 2,07,071 మంది వైరస్ బారి నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 93.08%కి చేరుకుంది. అదే విధంగా, 2,713 మంది కోవిడ్ బాధితులు మరణించడంతో కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,40,702కి పెరిగింది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 77,420 తగ్గడంతో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 16,35,993కి చేరుకుంది. గత ఐదు రోజుల్లో సుమారు 4 లక్షల క్షీణత నమోదైంది. మే 30న మొత్తం 20.26 లక్షల యాక్టివ్ కేసులు నమోదుకాగా ఇవి ఇప్పుడు 16.35 లక్షలకు చేరుకున్నాయి. ఇందులో రాష్ట్రాల వారిగా చూస్తే కర్ణాటకలో అత్యధికంగా 2,86,819, తమిళనాడులో 2,80,426 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పరీక్షల్లోనూ పురోగతి కనిపిస్తోంది. గత 24 గంటల్లో 20,75,428 కరోనా టెస్ట్‌లు జరుగగా పాజిటివిటీ రేటు 6.38%గా నమోదైంది. దేశంలోని 377 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5%కంటే తక్కువగా ఉందని కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్ర క్రియ సైతం వేగం పుంజుకుంది. గత 24 గంటల్లో దేశంలో 28,75,286 డోస్‌ల వ్యాక్సిన్ వేయడంతో మొత్తం సంఖ్య 22.41కోట్లకు చేరుకుంది. వ్యాక్సినేషన్లో అమెరికాను మించి.. దేశంలో కనీసం ఒక్క డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య అమెరికా కంటే ఎక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత వేగవంతం చేస్తామని తెలిపింది. దేశంలో కనీసం ఒక్క డోసైనా కోవిడ్ టీకా తీసుకున్న వారు 17.2 కోట్లు కాగా, అమెరికా ఇది 16.9కోట్లుగా ఉందని పేర్కొంది. దేశంలోని 60 ఏళ్లు పైబడిన వారిలో 43%మంది, 45 ఏళ్లు పైబడిన వారిలో 37% మంది టీకా వేయించుకున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. రానున్న కొద్ది వారాల్లోనే 50% దాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి 10 లక్షల జనాభాలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచ సరాసరి 22,181 కాగా, భారత్‌లో అది 20,519గా ఉందని వివరించారు. అదే సమయంలో, ప్రతి 10 లక్షల మంది బాధితుల్లో కోవిడ్ మృతులు భారత్‌లో 245మాత్రమే కాగా, ప్రపంచ సరాసరి 477 అని ఆయన పేర్కొన్నారు. -
గుడ్ న్యూస్: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
సాక్షి ,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. అయితే కేసుల నమోదులో తగ్గుదల.. పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్‌లో తెలిపింది. 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2713. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,07,071 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,65,97,655 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్‌గా కేసులు 16,35,993 ఉన్నాయి. 24 గంటల్లో20,75,428 మందికి కరోనా పరీక్షలు చేయగా వీటిని కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 35,74,33,846. టీకాల పంపిణీ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో 140 రోజులుగా కొనసాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 28,75,286 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్ పొందిన వారు 22,41,09,448 మంది ఉన్నారు. చదవండి: కరోనా పేషెంట్ల మరుగుదొడ్లు కడిగిన చిన్నారి.. వీడియో వైరల్ -
నిన్న తగ్గి నేడు పెరిగి: కొనసాగుతున్న కరోనా విజృంభణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. అయితే కేసుల నమోదులో తగ్గుదల.. పెరుగుదల కనిపిస్తోంది. నిన్న మంగళవారం కేసులు తగ్గగా నేడు బుధవారం స్వల్పంగా పెరిగాయి. నిన్న లక్షా 27 వేల కేసులు నమోదు కాగా నేడు లక్షా 32 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. దేశంలో కొత్తగా 1,32,788 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కరోనా బులెటిన్‌లో తెలిపింది. అయితే మరణాల్లో కూడా పెరుగుదల కనిపించింది. 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,207. ఇక కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,31,456 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,61,79,085 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 17,93,645. 24 గంటల్లో 20,19,773 మందికి కరోనా పరీక్షలు చేయగా వీటిని కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన పరీక్షలు 35,00,57,330. టీకాల పంపిణీ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్ పొందిన వారు 21,85,46,667 మంది ఉన్నారు. చదవండి: మూడో దశ కరోనాపై సర్కార్ హైఅలర్ట్ చదవండి: కరోనాతో ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ మృతి -
కంట్రోల్లోకి కోవిడ్: కొత్తగా లక్షన్నరకు దిగువన కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా లక్షన్నరకు దిగువకు రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదైంది. 24 గంటల్లో 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,795 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,55,287 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,81,75,044. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,95,520. కరోనాకు చికిత్స పొంది ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి మొత్తం సంఖ్య 2,59,47,629. దేశంలో మొత్తం కరోనా మృతులు 3,31,895. దేశంలో 91.60 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండడం గమనార్హం. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.22 శాతం. మొత్తం కేసులలో మరణాల రేటు 71.16 శాతంగా ఉంది. ఇక వ్యాక్సిన్ ప్రక్రియలో కొంత వేగం పెరిగింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 27,80,058 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారు. చదవండి: భయాందోళన వద్దు.. ఈనెలలోనే కరోనా తగ్గుద్ది -
గత 50 రోజుల్లో అత్యంత కనిష్టం
సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువగా కొత్త కేసులు నమోదవడం గత 50 రోజుల్లో ఇదే తొలిసారి. అయితే, మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,47,534కు చేరుకుంది. అయి తే, కోవిడ్ మరణాల సంఖ్య ప్రతిరోజూ ఇంకా మూ డువేల పైనే నమోదవుతోంది. గత 24 గంటల్లో 3,128 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,29,100కు పెరిగింది. మరోవైపు, రోజు వారీ కొత్త కేసుల సంఖ్య కంటే రోజువారీ రికవరీల సం ఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలా గత 18 రోజులుగా రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. పాజిటివిటీ రేటు 9.07% దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,26,092కు తగ్గింది. ఆదివారం దేశంలో 16,83,135 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 34,48,66,883కు పెరిగింది. కరోనా పాజిటివిటీ రేటు 9.07 శాతంగా నమోదైంది. గత ఏడు రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉంది. కాగా దేశంలో గత 24 గంటల్లో 2,38,022 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,56,92,342కు పెరిగింది. రికవరీ రేటు 91.60 శాతానికి పెరగడం గమనార్హం. అదే సమయంలో మరణాల రేటు 1.17 శాతంగా నమోదైంది. -
సెకండ్ వేవ్: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 46 రోజులతో పోల్చితే ఈ రోజు కోవిడ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. గత 24గంటల్లో భారత్‌లో 1,65,553 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 3,617 మంది కోవిడ్‌తో మృతి చెందారు. కొత్త మరణాలతో కలుపుకుని మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,25,972కు పెరిగింది. అదేవిధంగా గత 24 గంటల్లో 2,76,309 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,54,54,320కు చేరుకుంది. అదే సమయంలో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,14,508కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 20,63,839 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 34,31,83,748కు చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21,20,66,614 కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: సీఆర్పీఎఫ్ డీజీకి ఎన్ఐఏ బాధ్యతలు) -
గుడ్‌న్యూస్: దేశంలో కరోనా తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రెండో విడత కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసులు, మరణాల సంఖ్య తగ్గుతున్నాయి. తాజాగా మరోసారి 2 లక్షలకు దిగువకు రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య నమోందైంది. 24 గంటల్లో 1,73,790 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,617 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. మరణాలు తగ్గితే దేశంలో కరోనా అదుపులోకి వచ్చినట్టుగా భావించవచ్చు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,84,601 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,77,29,247. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,28,724. కరోనాకు చికిత్స పొంది ఇప్పటివరకు డిశ్చార్జయిన వారి మొత్తం సంఖ్య 2,51,78,011. దేశంలో మొత్తం కరోనా మృతులు 3,22,512. దేశంలో 90.80 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండడం గమనార్హం. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 8.04 శాతం. మొత్తం కేసులలో మరణాల రేటు 1.16 శాతంగా ఉంది. ఇక వ్యాక్సిన్ ప్రక్రియలో కొంత వేగం పెరిగింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30,62,747 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా రికార్డ్ స్థాయిలో నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,80,048. -
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుంది: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా బలహీన పడుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 20 రోజులుగా నమోదవుతున్న రోజువారీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంది. గత రెండు వారాలుగా రోజువారీ రికవరీల సంఖ్య తాజా ఇన్ఫెక్షన్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉందని, అలాగే దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసులు కూడా స్థిరంగా తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. దేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. మే 7న గరిష్ట స్థాయి(4,14,188 పాజిటివ్ కేసులు) తరువాత, దేశంలో రోజువారీ కేసులు మే 12న 3,48,421 కు తగ్గాయని, ఆ సంఖ్య మే 17 నాటికి మూడు లక్షల లోపుకు పడిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత నేటి వరకు కేసుల సంఖ్య 3,00,000 మార్కును దాటలేదని, ఇది శుభపరిణామంగా పరిగణించవచ్చని తెలిపారు. ఇక దేశవ్యాప్త రికవరీ రేటు విషయానికొస్తే.. మే 3న 81.8 శాతంగాఉన్న రికవరీ రేటు, మే 18న 85.6 శాతానికి పెరిగిందని, ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 90 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా సుమారు 2, 11,000 కొత్త కేసులు నమోదైనట్లు ప్రకటించారు. చదవండి: లక్షద్వీప్ భవిష్యత్తు తలచుకుంటే భయం వేస్తుంది.. -
సెకండ్ వేవ్: మళ్లీ 2 లక్షలు దాటిన కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో మళ్లీ 2లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 2,08,921 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 4,147 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. కొత్త మరణాలతో కలుపుకుని మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,11,388 కు పెరిగింది. మరణాల రేటు 1.14 శాతంగా నమోదైంది. మరోవైపు, దేశంలో పాజిటివిటీ రేటు 9.60 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,95,955 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,43,50,816కు చేరుకుంది. రికవరీ రేటు 89.26 శాతానికి పెరిగింది. అదే సమయంలో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 24,95,591కు చేరింది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 20,39,087 మంది కాగా.. రికార్డ్ స్థాయిలో 22,17,320 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. (చదవండి: కోవిడ్ వల్ల అనాథలుగా 577 మంది బాలలు) -
తగ్గుతున్న కరోనా ఉధృతి!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ప్రకోపం కాస్తంత తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ నెల పదో తేదీన 24.83 శాతంగా ఉన్న కరోనా కేసుల పాజిటివిటీ రేటు మే 22(శనివారం) నాటికి 12.45 శాతానికి దిగిరావడమే ఇందుకు తగిన తార్కాణం. పాజిటివిటీ రేటుతోపాటు రోజువారీ కొత్త కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ శనివారం మీడియాకు చెప్పారు. దేశవ్యాప్తంగా 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతంపైగానే ఉందని ఆయన వెల్లడించారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. 18 రాష్ట్రాల్లో 15 శాతానికిపైగా పాజిటివిటీ రేటు నమోదవుతోందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. రోజురోజుకూ కరోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్నప్పటికీ పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని, మే 10న 24.83 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 22వ తేదీకి 12.45 శాతానికి పడిపోయిందని లవ్ అగర్వాల్ వివరించారు. తగ్గిన వ్యాక్సిన్ వృథా వ్యాక్సిన్ డోస్‌ల వృథా సైతం తగ్గిందని అగర్వాల్ చెప్పారు. మార్చి ఒకటో తేదీన 8 శాతమున్న వృథా.. ప్రస్తుతం ఒక్క శాతానికి తగ్గిపోయిందన్నారు. అదేకాలానికి కోవాగ్జిన్ వ్యాక్సిన్ వృథా 17 శాతం నుంచి 4 శాతానికి దిగిరావడం సానుకూల అంశమన్నారు. కొత్తగా 2.57 లక్షల పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో 2.57 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడు లక్షలలోపు కేసులు రావడం వరసగా ఇది ఆరోరోజు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కు పెరిగింది. మరోవైపు రికార్డుస్థాయిలో గత 24 గంటల్లో 4,194 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ బాధితుల మొత్తం మరణాల సంఖ్య 2,95,525కు పెరిగింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 29,23,400కు తగ్గింది. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో కేవలం 11.12 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 69.94% కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 87.76 శాతం రికవరీ రేటు ఇప్పటిదాకా భారత్‌లో మొత్తం 2,30,70,365 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు మరింత మెరుగై 87.76 శాతానికి చేరుకుంది. కాగా, మరణాల రేటు 1.12 శాతంగా నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తంగా 32,64,84,155 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 20,66,285 శాంపిళ్లను పరీక్షించారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధిక కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1,263 మంది చనిపోయారు. కేంద్రం కేటాయింపులు బ్లాక్ ఫంగస్ చికిత్సకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనపు ఔషధాలను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాలు, యూటీలకు 23,680 వయల్స్ యాంఫోటెరిసిన్–బి పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్‌కు 2,310 వయల్స్, తెలంగాణకు 890 వయల్స్ కేటాయించారు. -
సెకండ్ వేవ్‌లో 400 మందికి పైగా వైద్యులు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో వైపు డాక్టర్లు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా..అంకితభావంతో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి కోవిడ్ బాధితులను రక్షిస్తున్న డాక్టర్లు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్‌లో కోవిడ్ సోకి 420 మందికిపైగా వైద్యులు కన్నుమూసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది. ఈ ఒక్క వారంలోనే కరోనావైరస్ కారణంగా 270 మంది వైద్యులు మరణించినట్లు తెలిపింది. వీరిలో 100 మందికిపైగా ఢిల్లీకి చెందిన వారేనని పేర్కొంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం..కరోనా ఫస్ట్ వేవ్‌లో 748 మంది వైద్యులు మరణించారు. ఐఎంఎఫ్ దాదాపు 3.35 లక్షల మంది సభ్యుల సమాచారాన్ని మాత్రమే రికార్డు చేసి ఉంచుతుంది. అయితే దేశంలో 12 లక్షలకు పైగా వైద్యులు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,57,299 కరోనా కేసులు నమోదైనట్లు, 4,194 మంది ప్రాణాలు కోల్పోయిట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత నెల దేశరాజధాని ఢిల్లీ కరోనాతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఢిల్లీ తరువాత అత్యధికంగా బీహార్‌లో 96 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, గుజరాత్లో 31 మంది, తెలంగాణలో 20 మంది, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో 16 మంది చొప్పున చనిపోయినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. (చదవండి: వైరల్: వృద్ధుడి స్టెప్పులకు..నెటిజన్ల కళ్లు జిగేల్) -
వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం ఇక పై కరోనా నుంచి కోలుకున్న వారు మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం తాజాగా వెల్లడించింది. ఇటీవల 45 రోజుల వ్యవధి ఉండగా ప్రస్తుతం దాన్ని మూడు నెలలకు పెంచింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత కరోనా వస్తే రెండు డోసును మూడు నెలల తర్వాత తీసుకోవాలని కేంద్రం సూచించింది. బాలింతలు కూడా టీకా తీసుకోవచ్చని సూచించింది. వ్యాక్సిన్ ఇచ్చేముందు రాపిడ్ యాంటిజెన్ అవసరంలేదని స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం ఈ మేరకు చేసిన సూచనలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదించింది. చదవండి: ‘టీకాలను భారత్‌లో కన్నా విదేశాలకే అధికంగా పంపిణీ చేశాం Gap between 2 doses of #CovishieldVaccine has been increased to 12-16 weeks from 6-8 weeks currently. Decision has been taken based on recommendations given by COVID working group after analysing emerging evidence.@PMOIndia @MoHFW_INDIA #Unite2FightCorona pic.twitter.com/kRbbjxGKSJ — Dr Harsh Vardhan (@drharshvardhan) May 13, 2021 -
మరో 4,187 మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో తొలిసారి కరోనా సంబంధిత మరణాలు 4వేల మార్క్‌ను దాటేశాయి. 24 గంటల్లో 4,187 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దేశంలో ఒక్క రోజులో ఈ స్థాయిలో మరణించడం ఇదే మొదటిసారి. తాజాగా, కోవిడ్ మృతుల సంఖ్య 2,38,270కు చేరుకుంది. 24 గంటల్లో కర్ణాటకలో మొట్టమొదటి సారిగా 592 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 898, ఉత్తరప్రదేశ్‌లో 372, ఢిల్లీలో 341, ఛత్తీస్‌గఢ్‌లో 208, తమిళనాడులో 197 మరణాలు అత్యధికంగా నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజులో 4,01,078 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మే 7వ తేదీ వరకు దేశంలో 1,09,68,039 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో గతేడాది జనవరి 30 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు 1,09,16,481 కేసులను గుర్తించారు. అంటే గత 82 రోజుల్లో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రెట్టింపైంది. మరోవైపు, దేశంలో 24 గంటల్లో 3,18,609 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 1,79,30,960కు చేరుకుంది. అదే సమయంలో, దేశంలో యాక్టివ్ కేçసుల సంఖ్య 37,23,446కు పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది 17.01%గా ఉంది. ప్రపంచంలో అమెరికా తరువాత భారత్‌లోనే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 22.17%గా నమోదైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం చేసిన 18,08,344 కరోనా సంక్రమణ టెస్ట్‌లతో కలిపి ఇప్పటివరకు దేశంలో 30 కోట్లకు పైగా టెస్ట్‌లు పూర్తయినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. భువనేశ్వర్‌లో వాహనదారునికి కోవిడ్ టీకా ఇస్తున్న దృశ్యం -
‘కోవిడ్ చికిత్సకు పాజిటివ్ రిపోర్ట్ అక్కర్లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ - 19 పాజిటివ్ రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి కచ్చితంగా ఆ రిపోర్ట్ అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కోవిడ్ రిపోర్ట్ ఉండాలనే నిబంధనను సవరిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ఆరోగ్య సదుపాయంలో భాగంగా చికిత్ప కోసం కోవిడ్-19 పాజిటివ్ రిపోర్ట్ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..ఏ రోగికి కూడా చికిత్స నిరాకంచవద్దు. రోగి వేరే నగరానికి చెందినవాడైనప్పటికీ అవరమైన మందులు, ఆక్సిజన్ అందించాల్సిందేనని ఓ ప్రకటనలో పేర్కొంది. చికిత్సకు వచ్చే వారిని సీసీసీ, డీసీహెచ్‌సీ, డీహెచ్సీ వార్డులో అనుమానిత కేసులుగా చేర్చుకోవాలని సూచించింది.కోవిడ్-19తో బాధపడుతున్న రోగులకు సత్వరం, సమర్థవంతమైన చికిత్స అందించాలని తెలిపింది. ఆసుపత్రిలో రోగిని అవసరాన్ని బట్టి చేర్చుకోవాలని, పడకలు నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించకుండా చూసుకోవాలని తెలిపింది. (చదవండి: జూపార్క్‌పై కోవిడ్ దెబ్బ: 20 మంది ఉద్యోగులపై వేటు) -
Corona Cases in India: కరోనా కేసులు మళ్లీ పైపైకి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ పట్టపగ్గాల్లేకుండా భారతదేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కరోనా సంక్రమణతో దేశంలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,12,262 కొత్త కరోనా రోగులను గుర్తించారు. ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్కరోజులో ఇంతటి భారీస్థాయిలో కేసులు నమోదుకాలేదు. కాగా, 24 గంటల్లో ఇంతటి భారీస్థాయిలో కొత్త కేసులు భారత్‌లో నమోదవడం ఇది రెండోసారి. గతంలో ఏప్రిల్ 30న 4,02,351 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షలాది కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,77,410కు చేరింది. కోవిడ్ బారిన పడి గత 24 గంటల్లో మరో 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,30,168కు పెరిగింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 920 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 353 మంది చనిపోయారు. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 81.99 శాతానికి చేరుకుంది. పాజిటివిటీ రేటు 21.43గా నమోదైంది. 35.66 లక్షల యాక్టివ్ కేసులు దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండడంతో చికిత్స పొందుతున్న యాక్టివ్ రోగుల సంఖ్య సైతం వేగంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 3,29,113 మంది కరోనాను ఓడించారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 1,72,80,844కు చేరింది. రోజూ నమోదైన కొత్త కరోనా కేసులతో పోలిస్తే కోలుకుంటున్న రోగుల సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఈ కారణంగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35,66,398 కు పెరిగింది. ప్రపంచంలో అమెరికా తర్వాత భారత్‌లోనే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, రాజస్తాన్, బిహార్‌సహా 12 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో 6.43 లక్షలు, కర్ణాటకలో 4.87 లక్షలు, కేరళలో 3.76 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 2.62 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో 81.05% యాక్టివ్ కేసులు 12 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటిదాకా 16,25,13,339 కోవిడ్ టీకాలిచ్చారు. బుధవారం వరకు మొత్తంగా 29,67,75,209 కరోనా శాంపిల్స్ పరీక్షలు చేశారు. వీటిలో 19,23,131 శాంపిల్స్‌ను బుధవారం ఒక్కరోజులోనే పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. -
ఏప్రిల్ నెల వచ్చిందంటే దేశవాసుల గుండెల్లో రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: రెండేళ్ళుగా ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు దేశవాసుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో కరోనా సంక్రమణ కారణంగా లాక్‌డౌన్‌ను అనుభవించిన భారత్‌లో ఈ ఏడాది పరిస్థితులు మరింత దయనీయంగా తయారయ్యాయి. ఏప్రిల్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి తలెత్తింది. ఏప్రిల్ 1వ తేదీన దేశవ్యాప్తంగా 81,466 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఏప్రిల్ 30వ తేదీ నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా 4,01,993కు చేరింది. వైరస్ సంక్రమణ దేశంలో ఎంత వేగంగా ఉందో ఈ నెల రోజుల గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. ఏప్రిల్‌లో దేశంలో 69,43,284 మంది కరోనా బారినపడ్డారు. అదే సమయంలో దేశంలో వైరస్ కారణంగా 48,926 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 11,37,120 పాజిటివ్ కేసులు రాగా, 6,348మంది మరణించారు. అదే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వరకు 22,57,352 మందికి వైరస్ నిర్ధారణ జరుగగా, 13,278 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఏప్రిల్ 21వ తేదీ నుంచి కరోనా దేశంలో విలయతాండవం చేయడం ప్రారంభించింది. 21వ తేదీ నుంచి దేశంలో ప్రతీ రోజు 3లక్షలకు పైగా కరోనా సంక్రమణ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ మధ్య 10 రోజుల వ్యవధిలో 35,48,839 కరోనా పాజిటివ్ కేసులు రాగా, 29,300 మంది కరోనాతో పోరాడి ఓడిపోయి తుదిశ్వాస విడిచారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులలో విలవిల్లాడిపోయినా అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలను సైతం భారత్ వెనక్కి నెట్టేసింది. ఏప్రిల్ నెలలో అమెరికాలో 18,86,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా, బ్రెజిల్లో 19,13,264 పాజిటివ్ కేసులను గుర్తించారు. -
హోం ఐసోలేషన్.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బారిన పడి ఇంట్లోనే ఉండే ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితులకు సంబంధించి కేంద్రం ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు తప్పనిసరిగా ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్‌ను వినియోగించాలని సూచించింది. ఎనిమిది గంటల తర్వాత వాటిని పడేయాలని తెలిపింది. అలానే హోం ఐసోలేషన్‌లో ఉన్న వారి వద్దకు కుటుంబసభ్యులు ఎవరైనా వస్తే.. బాధితుడు, కుటుంబ సభ్యుడు ఇద్దరూ ఎన్ 95 మాస్క్ ను ధరించాలని స్పష్టం చేసింది. 1 శాతం సోడియం హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారకం చేసిన తర్వాత మాత్రమే మాస్క్‌ను తొలగించాలని సూచించింది. కరోనా బారిన పడిన వారు తగినంత విశ్రాంతి తీసుకోవాలని.. ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. దేశంలో ఒకే రోజు 3,79,257 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో కేంద్రం ఈ కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరుకోగా యాక్టీవ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. చదవండి: మాస్క్ పెట్టుకోనందుకు ప్రధానికి రూ.14 వేల జరిమానా -
Corona Deaths in India: కొనసాగుతున్న హాహాకారాలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్రమణ దేశంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వైరస్ సంక్రమిస్తున్న కొత్త రోగులు, మరణాల సంఖ్య ప్రతీరోజు రికార్డుస్థాయిలో పెరుగుతోంది. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,52,991 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో దేశంలో కరోనా సోకిన మొత్తం రోగుల సంఖ్య 1.73,13,163 కు పెరిగింది. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్‌లతో సహా మొత్తం పది రాష్ట్రాల్లోనే 74.5% కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 66,191, ఉత్తర్‌ప్రదేశ్‌లో 35,311, కర్ణాటకలో 34,804 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 2,812 మంది తుదిశ్వాస విడిచారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,95,123 కు చేరుకుంది. అయితే గతేడాది మన దేశంలో కోవిడ్–19 సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే రోజులో అత్యధికంగా కొత్త కరోనా రోగులు, మరణాల సంఖ్య ఆదివారం నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 832 మంది, ఢిల్లీలో 350 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్యలో పెరుగుదల కారణంగా శ్మశానవాటికల్లో దహన సంస్కారాల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేకచోట్ల శ్మశానవాటికల్లో స్థలం లేకపోవడం కారణంగా మృతదేహాలను పార్కుల్లోనే దహనం చేస్తున్నారు. మరోవైపు దేశంలో యాక్టివ్ రోగుల సంఖ్య సైతం రోజు రోజుకి పెరుగుతోంది. ఈ సంఖ్య 28,13,658 కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 16.25 శాతం. ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక యాక్టివ్ కేసులు భారత్‌లోనే ఉన్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లోనే 69.67% యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే సమయంలో వైరస్ నయం అయిన వారి సంఖ్య సైతం పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,19,272 కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1,43,04,382 మంది రోగులు కరోనా వైరస్‌ను జయించారు. అయితే గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో నమోదవుతున్న రోగుల సంఖ్యతో పోలిస్తే కోలుకుంటున్న రోగుల సంఖ్య తక్కువగా ఉండడం కాస్త ఆందోళన కలిగించే విషయం. మరోవైపు దేశంలో రెండవదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 14,19,11,223 మందికి వ్యాక్సిన్లు వేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మూడవ దశ మే 1 నుంచి ప్రారంభంకానుంది. -
ఆక్సిజన్ కొరత: ప్రోనింగ్ చేయమంటున్న కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ నిల్వలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అయిపోవడటంతో కోవిడ్ రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో కోవిడ్ పేషెంట్లకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది. శ్వాసను మెరుగుపరుచుకోవడానికి, ఆక్సిజనేషన్ కోసం ప్రోనింగ్ చేయమని సలహా ఇచ్చింది. ముఖ్యంగా స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే చికిత్స పొందుతూ.. శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఏంటి ప్రోనింగ్... ప్రోనింగ్ అనే ప్రక్రియ వల్ల సౌకర్యంగా శ్వాస తీసుకోవడం, ఆక్సిజనేషన్ని మెరుగుపరుస్తుందని మెడికల్‌గా నిరూపితమైనట్లు కేంద్రం తెలిపింది. ఇక ఉదరభాగంపై బరువు వేసి బోర్లా పడుకోవడమే ఈ టెక్నిక్. దీనినే ప్రోనింగ్ పొజిషన్ అంటారు. ఇది వెంటిలేషన్‌ను మెరుగుపరుస్తుంది. రక్తంలో ఆక్సిజన్ లెవల్ 94 శాతం కంటే దిగువకు పడిపోయినప్పుడే ఈ పని చేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్‌ను పరిశీలిస్తుండటం, ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర స్థాయిలను చూసుకుంటూ ఉండాలని స్పష్టం చేసింది. సరైన సమయంలో ప్రోనింగ్ చేస్తే ఎన్నో ప్రాణాలు నిలుపుకోవచ్చని కూడా తెలిపింది. #Unite2FightCorona Proning as an aid to help you breathe better during #COVID19 pic.twitter.com/FCr59v1AST — Ministry of Health (@MoHFW_INDIA) April 22, 2021 ఎలా చేయాలో వివరించింది.. ప్రోనింగ్ ఎలా చేయాలో కూడా చెబుతూ.. వాటిని వివరించే కొన్ని ఫోటోలను కేంద్రం ట్వీట్ చేసింది. ప్రోనింగ్ చేయడానికి మొత్తం ఐదు తలగడలు అవసరం అవుతాయి. వీటిలో ఒకదాన్ని (తలగడ) మెడ కింద, మరొకటి లేదా రెండు ఛాతీ నుంచి తొడల వరకు, మరో రెండు మోకాళ్ల కింద పెట్టుకోవాలని సూచించింది. అంతేకాక ఈ ప్రక్రియలో రోగిని సాధారణ బెడ్, చదరంగా ఉన్న షీట్ మీద పడుకోబెట్టాలని వెల్లడించింది. దూరంగా ఉండాల్సిన వారు... ఇక గర్భవతులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు, వెన్నెముకకు గాయమైన వాళ్లు దీనికి దూరంగా ఉంటే మంచిదని కేంద్రం స్పష్టం చేసింది. భోజనం చేసిన తర్వాత కూడా ప్రోనింగ్ ప్రక్రియ చేయకూడదని తెలిపింది. చదవండి: ప్రాణం తీస్తున్న ‘ఆక్సిజన్’: 25 మంది మృతి -
ఆ ఎనిమిది రాష్ట్రాల్లో కోవిడ్ విలయ తాండవం
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 81,466 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కి చేరుకుంది. ఇక నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే కొన్ని రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. అత్యధిక కేసులు వస్తున్నప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నివారణా చర్యలను ముమ్మరం చేయాలనే ఉద్దేశ్యంతో కేసులకు సంబంధించి గణాంకాలను కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ ఎనిమిది రాష్ట్రాల ప్రజలు జర జాగ్రత్తగా ఉండాలి మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గడ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్. కేవలం ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచి కేసులు 81.42 శాతం నమోదయ్యాయి. ఇక జిల్లాల పరంగా చూస్తే..పుణె, ముంబై, నాగ్‌పూర్, థానే, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్‌నగర్, నాందేడ్. ఈ పది జిల్లాలు నుంచి 50 శాతం కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదల పరంగా..మహారాష్ట్రలో కేసుల పెరుగుదల తొమ్మిది రెట్లుగా ఉండగా, శాతాల పరంగా పంజాబ్ అత్యధిక శాతంగా నమోదు అవుతున్నాయి. ఇక దేశం మొత్తం మీద ఒక్క మహారాష్ట్ర నుంచి మాత్రమే 59.36 శాతం కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర డేంజర్ జోన్లో ఉన్నట్లు చెప్పాలి. అక్కడి రోజువారీ అత్యధికంగా 47,913 కేసులు వస్తున్నాయి. తరువాత స్థానంలో కర్ణాటక 4,991కాగా, ఛత్తీస్‌గడ్‌లో 4,174 కేసులు ఉన్నాయి. మహరాష్ట్ర, ఛత్తీస్గడ్, పంజాబ్, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కేరళతో కలిపి ఈ పన్నెండు రాష్ట్రాలు రోజువారీ కొత్త కేసులలో పెరుగుదల ఎక్కువగా ఉందంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శనివారం ఒక రోజులో 89,129 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఆరున్నర నెలల్లో రోజువారీ అత్యధిక పెరుగుదలలో ఇదే అత్యధిక కేసుల నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసులు సంఖ్య 1.23 కోట్లకు పైగా నమోదు కాగా, మొత్తం మరణాల 1,64,110 కు పెరిగింది, ఒక రోజులో 714 మరణాలు సంభవించాయి, ఇది అక్టోబర్ నెల తరువాత ప్రస్తుత గణాంకాలే నమోదే అధికం. ఒక రోజులో 714 మరణాలు సంభవించాయి, కొత్త మరణాలలో ఆరు రాష్ట్రాలు 85.85 శాతం ఉన్నాయి. మహారాష్ట్రలో గరిష్టంగా 481 మంది మరణించగా, 57 మంది పంజాబ్‌లో మరణించారు. గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదుకాలేదు. అవి ఒడిశా, అస్సాం, లడఖ్, దాద్రా నగర్ హవేలి ,డామన్ అండ్ డియు, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, సిక్కిం, లక్షద్వీప్, మిజోరం, అండమాన్ మరియు నికోబార్ దీవులు అవి ఒడిశా, అస్సాం, లడఖ్, దాద్రా నగర్ హవేలి( చదవండి: కరోనా : పుణేలో రాత్రి కర్ఫ్యూ, థియేటర్ల మూత ) -
కరోనా: 12 రాష్ట్రాలతో కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, ఢిల్లీ: కరోనాపై 12 రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష జరిపింది. మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్, బిహార్ రాష్ట్రాలపై కేంద్రం కీలక సమీక్ష నిర్వహించింది. కరోనా కేసుల వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలపై ఆరా తీసింది. 46 జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. కరోనా కేసులు పెరిగే రాష్ట్రాల్లో టీకాలు, పరీక్షలు పెంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. కఠిన చర్యలు, కంటైన్మెంట్ జోన్లతో కట్టడి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా, కొత్త కేసుల్లో 73.64 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35,952 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్–ఉల్–ఫితర్ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్లు వంటి వాటికి సంబంధించి ఈ నెల 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించింది. చదవండి: 60 వేల చేరువలో ఒక్కరోజు కేసులు కరోనా ఉన్నా.. మీడియా టీంతో ఇమ్రాన్ భేటీ -
60 వేల చేరువలో ఒక్కరోజు కేసులు
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 59,118 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్ 18 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 257 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,949కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,64,637కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.09 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,21,066గా ఉంది. మూడు రాష్ట్రాల్లో.. కొత్త కేసుల్లో 73.64 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35,952 కేసులు నమోదయ్యాయి. దేశంలో 5.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ మహారాష్ట్రలో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించారు. మార్చి 28వ తేదీ ఆదివారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అన్ని షాపింగ్‌మాల్స్ రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న పండుగల్లో జాగ్రత్త: కేంద్రం కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శుక్రవారం ఢిల్లీలో మాట్లాడారు. త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్–ఉల్–ఫితర్ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశం ప్రస్తుతం కీలక దశలోకి చేరుకుందని ఈ దశలో అలసత్వం ప్రదర్శించడం మంచిదికాదన్నారు. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్లు వంటి వాటికి సంబంధించి ఈ నెల 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించారు. -
56.36 లక్షల మందికి టీకా
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య శనివారానికి 56,36,868కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా, 6,73,542 మంది, మహారాష్ట్ర నుంచి 4,34,943 మంది, రాజస్తాన్ నుంచి 4,14,422 మంది, కర్ణాటక నుంచి 3,60,592 మంది ఉన్నట్లు తెలిపింది. కేవలం 21 రోజుల్లోనే 50 లక్షల మార్కును దాటిందని పేర్కొంది. వ్యాక్సినేషన్ పొందిన వారిలో 52,66,175 మంది ఆరోగ్య కార్యకర్తలు, 3,70,693 ఫ్రంట్ కేర్ వర్కర్లు ఉన్నట్లు వెల్లడించింది. కోవిన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న హెల్త్‌కేర్ వర్కర్లలో 54.7శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపింది. వ్యాక్సినేషన్ వేగం పెంచండి జనవరి 16న మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ నెల 13న రెండో డోస్ వ్యాక్సినేషన్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ నెల 20లోగా ఆరోగ్య కార్యకర్తలందరికీ కనీసం ఒక్కసారైనా వ్యాక్సిన్ షెడ్యూల్ కేటాయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు. ప్రస్తుతం కేటాయిస్తున్న సెషన్లలో వ్యాక్సినేషన్ పొందాల్సిన వారి సంఖ్యను పెంచేందుకు అవకాశం ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్ సాగుతున్న తీరును పరిశీలించేందుకు రాష్ట్ర/జిల్లా/బ్లాక్ స్థాయిలో సమన్వయ సమావేశాలు జరగాలని సూచించారు. కొత్తగా ఉత్పన్నమవుతున్న సమస్యలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకొనేలా ఆయా సమావేశాలు సాగాలన్నారు.ఈ నెల 20 తర్వాత హెల్త్ వర్కర్ల కోసం మోప్ అప్ రౌండ్ ఏర్పాటు చేయాలని, మార్చి 6 తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం మోప్ అప్ రౌండ్ ఉండాలని చెప్పారు. త్వరలోనే కోవిన్ 2.0 వెర్షన్ విడుదలవుతుందని వెల్లడించారు. -
ఢిల్లీలో కరోనాకు కాలుష్యం తోడు
న్యూడిల్లీ: ఢిల్లీ కరోనా గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. కాలుష్యం కారణంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకి 7 వేలకు పైగా కేసులు నమోదవుతుంటే, గత 24 గంటల్లో 104 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత అయిదు నెలల కాలంలో ఢిల్లీని కరోనా ఈ స్థాయిలో వణికించడం ఇదే. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగిపోయి కేసులు కూడా పెరుగుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడు నుంచి 10 రోజుల్లో కరోనా నియంత్రణలోకి వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆ దిశగా పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. ‘‘గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాటిని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మరో వారం రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది’’ అని కే్రజ్రీవాల్ చెప్పారు. వాయు కాలుష్యం వల్లే కేసులు పెరిగిపోతున్నాయని, పంట వ్యర్థాల దహనం వచ్చే ఏడాది నాటికి ఉండకూడదని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 44 వేల కొత్త కరోనా కేసులు దేశంలో గత 24 గంటల్లో 44,879 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,28,795కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 547 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,28,668కు చేరుకుందని తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శుక్రవారానికి 81,15,580కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 92.97 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,84,547గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 5.55 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.47గా ఉంది. గత 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 122 మంది మరణిం చారు. ఈ నెల 12 వరకూ 12,31,01,739 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 11,39,230 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. -
రికవరీలో ప్రపంచంలో మనమే టాప్
న్యూఢిల్లీ: ఒకే రోజు నమోదైన కరోనా కేసులు 93,337 అదే రోజు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,880 కరోనాను జయించడంలో ఇది కూడా ఒక రకమైన పురోగతే. కేసుల భారం ఎక్కువగానే ఉన్నప్పటికీ రికవరీలో ప్రపంచంలో మనమే నంబర్ వన్ భారత్‌లో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తున్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ కూడా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 42,08,431 మంది కోవిడ్–19 నుంచి కోలుకున్నారు. దీంతో భారత్ రికవరీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అమెరికా 41 లక్షల మంది రికవరీతో రెండో స్థానంలో ఉంది. యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసులు 4.04 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 10 లక్షల 13 వేల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మొత్తం కేసుల సంఖ్య 53,08,014కి చేరుకుంది. దేశంలో రికవరీ రేటు 79.28గా ఉంది. రికవరీ సాధించింది ఇలా కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచడం, అత్యధికంగా పరీక్షలు చేయడం, ట్రాకింగ్, ట్రేసింగ్ విధానాన్ని సమర్థంగా నిర్వహించి సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా ఈ స్థాయిలో రికవరీ సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ట్వీట్లో పేర్కొంది. అంతేకాకుండా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, శరీరంలో వైరస్ దాడి తీవ్రతరం కాకుండా రెమిడెసివర్ ఇంజెక్షన్ల వినియోగం, ఆక్సిజన్ పరికరాలు, వెంటిలేటర్ల వినియోగం పెంచడం, ప్లాస్మా థెరపీ, అవసరమైతే స్టెరాయిడ్స్ ఇస్తూ ఉండడంతో ఈ స్థాయిలో రికవరీ సాధించామని తెలిపింది. భారత్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ దేశంలో జనాభాతో పోల్చి చూస్తే చాలా స్వల్పమేనని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా 60% వరకు రికవరీ కేసులు వస్తున్నాయని వివరించింది. -
రెండో స్థానంలోకి భారత్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలోకి చేరింది. కేసుల సంఖ్య దృష్ట్యా బ్రెజిల్‌ను దాటిపోయింది. ఈ క్రమంలో వరుసగా రెండో రోజు కూడా భారత్‌లో 90 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల్లో 90,802 కేసులు బయ టపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,04,613కు చేరుకుంది. గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు, రెండు రోజులుగా 90 వేలకు పైన కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 69,564 మంది కోలుకోగా 1,016 మంది మరణిం చారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 71,642కు చేరుకుందని కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 32,50,429 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,82,542గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.99% ఉన్నాయి. రికవరీ రేటు 77.30% పెరగ్గా, మరణాల రేటు 1.70%కి పడిపోయింది. యాంటీబాడీలు ఉన్నా కరోనా.. శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన కోవిడ్ సోకే ముప్పు తగ్గుతుందని చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని మీద ఉన్నవన్నీ ఊహాగానాలేనని, ఆధారసహిత ప్రయోగాలు లేవని అంటున్నారు. కరోనా సోకి కోలుకున్న వారు తిరిగి కరోనా బారిన పడటం పట్ల ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోలజీ నిపుణులు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. యాంటీబాడీలు కరోనాను పూర్తిస్థాయిలో నిరోధించడం లేదని చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలు, ప్రస్తుతమున్న కేసుల కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయని అన్నారు. శరీరంలో ఉన్న యాంటీబాడీల స్థాయిని తెలుసుకోకుండా కేవలం పాజిటివ్ లేదా నెగెటివ్ అని చెప్పడం వల్ల పూర్తి వివరాలు తెలియడం లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేస్తాం.. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు తాము సాయం అందిస్తామని యూనిసెఫ్ ప్రకటించింది. ఇప్పటికే మీజిల్స్, పోలియో వంటి వ్యాధులకు ఏటా 2 బిలియన్ల వ్యాక్సిన్లు కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పింది. కరోనా టీకా వచ్చాక దాదాపు 100 దేశాలకు సాయం అందిస్తామని చెప్పింది. దీని కోసం అమెరికావ్యాప్త ఆరోగ్య సంస్థ (పహో)తో కలసి కోవాక్స్ టీకా కోసం ఎందురు చూస్తున్నట్లు చెప్పింది. మలైకా అరోరాకు కోవిడ్ పాజిటివ్ బాలీవుడ్ నటి, వీడియో జాకీ, మోడల్ కూడా అయిన మలైకా అరోరా(46)కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో, కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి, వైద్యుల సలహా మేరకు తన ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నట్లు ఆమె సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. -
చనిపోతున్న వారిలో వృద్ధులే అధికం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 78,357 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 37,69,524 కు చేరింది. కరోనా రోగుల్లో ఇప్పటివరకు 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితో కోవిడ్ బారిన పడుతున్న వారిలో 18-44 ఏళ్ల వారే అధికంగా ఉన్నట్లు డేటా వెల్లడిస్తుంది. మొత్తం కరోనా కేసుల్లో వీరి సంఖ్య 54శాతంగా ఉంది. ఇక మరణాలను పరిశీలిస్తే.. వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో వృద్ధులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాల్లో 51శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారే ఉన్నట్లు డాటా తెలుపుతోంది. (చదవండి: కోవిడ్ విపత్తువేళ డ్యూక్స్ ఔదార్యం) #IndiaFightsCorona 54% #COVID19 cases are in the 18-44 years age group but 51% deaths are in the 60 years and above age group. pic.twitter.com/9ToEzUigYI — Ministry of Health (@MoHFW_INDIA) September 2, 2020 ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందిగా ప్రజలను కోరుతుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం.. సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను ఆచరిస్తేనే మహమ్మారి బారిన పడకుండా ఉండగలం అంటుంది. అంతేకాక ‘దేశ ప్రజలంతా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటించడం వంటి వాటిని కఠినంగా ఆచరిస్తే.. ఈ ఏడాది డిసెంబరు నాటికి 2 లక్షల మరణాలు సంభవించకుండా ఆపవచ్చని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కనుక ప్రజలంతా ఈ నియమాలను తప్పక పాటించాలని’ కోరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు 1.76 శాతంగా ఉంది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.43 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. #CoronaVirusUpdates: 📍Total #COVID19 Cases in India (as on September 02, 2020) ▶️76.98% Cured/Discharged/Migrated (29,01,908) ▶️21.26% Active cases (8,01,282) ▶️1.76% Deaths (66,333) Total COVID-19 confirmed cases = Cured/Discharged/Migrated+Active case Deaths#StaySafe pic.twitter.com/EWN8YG2eOy — #IndiaFightsCorona (@COVIDNewsByMIB) September 2, 2020 -
వారంలోనే నాలుగు లక్షలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. శనివారం తాజాగా మరో 76,472 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,63,972కు చేరుకుంది. గత 24 గంటల్లో 65,050 మంది కోలుకోగా 1,021 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 62,550కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 26,48,998కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 7,52,424గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 21.72గా ఉంది. యాక్టివ్ కేసుల కంటే 3.5 రెట్లు ఎక్కువగా కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. బుధవారానికి ఇది 76.47 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.81 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 28 వరకు 4,04,066,09 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం మరో 9,28,761 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు పది లక్షల పరీక్షలు జరిపే దిశగా దేశం పయనిస్తోందని తెలిపింది. గత వారం రోజుల్లో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలోనూ.. రెండోసారి రెనో: అమెరికాలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వైరస్ సోకింది. దేశంలో ఇలాంటిది ఇదే మొట్టమొదటి కేసుగా భావిస్తున్నారు. యూరప్‌తోపాటు హాంకాంగ్‌లో ఇటీవల ఇలాంటి కేసులు బయటపడిన విషయం తెలిసిందే. నెవడాలోని రెనోకు చెందిన ఓ వ్యక్తి(25) ఏప్రిల్‌లో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నాడు. జూన్‌లో అతనికే మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణయింది. మొదటిసారి కంటే ఈసారి అతడిపై వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. న్యుమోనియా కూడా రావడంతో ఆస్పత్రిలో ఆక్సిజన్‌తో చికిత్స అందించాల్సి వచ్చింది. కరోనా వైరస్ మళ్లీ సోకేందుకు అవకాశం ఉందనీ, రెండోసారి మరింత తీవ్రంగా ఉండొచ్చని నెవడా స్టేట్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీ డైరెక్టర్ మార్క్ పండోరి అన్నారు. 110 ఏళ్ల కోవిడ్ విజేత మలప్పురం: కరోనా సోకిందని తెలియగానే తీవ్ర భయాందోళనలకు లోనవుతున్న వారు ఎందరో. అలాంటిది కేరళలో ఓ శతాధిక వృద్ధురాలు కరోనాను జయించింది. రంధాథాని వరియత్ పథూ అనే 110 ఏళ్ల బామ్మకు తన కూతురు నుంచి కరోనా సోకింది. ఆగస్టు 18వ తేదీన మలప్పురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరిన పథూ కోలుకొని శనివారం డిశ్చార్జి అయ్యింది. ఆమెకు స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని, నిబ్బరంగా ఉంటూ చికిత్స తీసుకుందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కే.కే.శైలజ వెల్లడించారు. పథూకు చికిత్స అందించి కోలుకునేలా చేసిన డాక్టర్లను మంత్రి అభినందించారు. -
24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో కోవిడ్-19 కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కేసులు నమోదు కాగా.. 977 మంది వైరస్ బారిన పడి మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా ఉండగా 53,866 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది. -
24 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 64,553 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 24,61,190 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,007 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 48,040 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 16,95,982కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,61,595 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 26.88 గా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 71.17 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.95 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 1,007 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 413 మంది మరణించారు. ఆగస్టు 13 వరకు 2,76,94,416 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం రికార్డు స్థాయిలో 8,48,728 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. రోజుకు 10 లక్షల పరీక్షలు చేయడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది. మొత్తం 1,433 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. దేశంలో ప్రతి మిలియన్ మందికి రోజుకు 603 మందికి పరీక్షలు జరుగుతుండగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 2,822 మందికి పరీక్షలు చేస్తున్నారు. కోలుకున్న అమిత్‌షా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈనెల 2న ఆయనకు కరోనా పాజిటివ్ రాగా గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిపిన పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చిందని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘దేవుడికి ధన్యవాదాలు. నేను కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నా కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండబోతున్నాను’అని షా వెల్లడించారు. లవ్ అగర్వాల్‌కు కరోనా కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌కు కరోనా సోకింది. శుక్రవారం ఈ విషయం ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. దేశంలో కోవిడ్–19 వ్యాప్తిపై ఆయన కేంద్రం తరఫున ఏప్రిల్, మే నెలల్లో ప్రతి రోజూ మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మార్గదర్శకాల ప్రకారం హోం ఐసోలేషన్‌కు వెళుతున్నాను. త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుస్తానని ఆశిస్తున్నాను’అని లవ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. -
మీ చర్యలు బాగున్నాయ్.. కలెక్టర్‌కు కేంద్రం ప్రశంసలు
సాక్షి, అనంతపురం అర్బన్: కోవిడ్ కేర్ సెంటర్లలోని వ్యక్తుల్లో మానసింకంగా ఉల్లాసం నింపేందుకు కలెక్టర్ తీసుకున్న చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా ప్రశంసలు కురిపించింది. కేర్ సెంటర్లలోని పేషంట్లు కాలక్షేపం లేకపోవడంతో ఒంటరితనం భావనలో ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. శారీరక, మానసిక ఉల్లాసం కల్పించడం ద్వారా వారిలోని ఒంటరి భావన తొలగించవచ్చని ఆలోచన చేశారు. అందులో భాగంగా కేర్‌సెంటర్లలో టెన్సిస్, షెటిల్, వాలీబాల్, క్యారమ్స్ వంటి ఆటలు, సంగీతం కోసం మ్యుజిక్ సిస్టం ఏర్పాటు చేయించారు. ఉదయం, సాయంత్రం వేళ ఎవరికి నచ్చిన... వచ్చిన ఆటలను అంతే కాకుండా కేర్ సెంటర్లలో కౌన్సిలర్లను ఏర్పాటు చేయించారు. వారు కోవిడ్ పేషంట్లకు కౌన్సిలింగ్ ఇస్తూ ఆత్మస్థైర్యం నింపుతారు. కోవిడ్ కేర్ సెంటర్లలో పేషంట్ల ఉల్లాసం కోసం విడుదల చేసిన డాక్యుమెంటరీపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్ దారా స్పందించింది. కోవిడ్ కేర్ సెంటర్లలో మానసిక, శారీరక ఉల్లాసం కోసం తీసుకున్న చర్యల వల్ల పేషంట్లు ఉత్సాహంగా ఉంటూ త్వరగా రికవరీ అవుతారని పేర్కొంది. (రియల్ హీరోస్..) #IndiaFightsCorona A glimpse of the facilities being provided at the #COVID19 Care Centre, Anantapur district, Andhra Pradesh to the inmates to boost their morale and mental wellness. @PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @COVIDNewsByMIB @CovidIndiaSeva pic.twitter.com/8aVYYC15q2 — Ministry of Health (@MoHFW_INDIA) August 3, 2020 -
విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసింది. ఆగస్ట్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఆ వివరాలు.. ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా www.newdelhiairport.in లో 7 రోజుల పాటు పెయిడ్ ఇన్సిట్యూషనల్ క్వారంటైన్లో, 7 రోజులు హోం క్వారంటైన్లోఉంటామని అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ► కుటుంబంలో ఎవరైనా చనిపోయినవారు, వృద్ధులు, సీరియస్ వ్యాధులున్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలున్నవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండవచ్చు. అయితే, వారు బోర్డింగ్‌కు మూడు రోజుల ముందే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ► ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చినవారు కూడా ఆ డాక్యుమెంట్ చూపించి, 14 రోజుల హోం క్వారంటైన్ అవకాశం పొందవచ్చు. ఆ పరీక్ష బోర్డింగ్‌కు గరిష్టంగా నాలుగు రోజుల లోపు జరిపి ఉండాలి. ► అంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఎలాంటి కోవిడ్–19 లక్షణాలు లేనివారినే బోర్డింగ్‌కు అనుమతిస్తారు. ► భూ సరిహద్దుల ద్వారా వచ్చేవారు కూడా పై నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ► ప్రయాణంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే మాస్క్, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర నిబంధనలు పాటించాలి. ► ప్రయాణికుల్లో ఎవరికైనా కోవిడ్–19 లక్షణాలు కనిపిస్తే.. వారిని ఫ్లైట్/షిప్ గమ్యస్థానం చేరిన వెంటనే కోవిడ్ స్పెషల్ హెల్త్ సెంటర్లకు తరలించి, చికిత్స అందిస్తారు. -
లక్షన్నర దాటిన పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: 1,51,767 పాజిటివ్ కేసులు, 4,337 మరణాలు. దేశంలో కరోనా సృష్టించిన విలయమిది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరిగిపోతోంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,387 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 170 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 1,51,767కు, మరణాలు 4,337కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 83,004 కాగా, 64,425 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వస్తుండడంతో ఉత్తరాఖండ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యేందుకు మే 17 నాటికి 16 రోజులు పట్టగా, ప్రస్తుతం 4 రోజులే పడుతోంది. ఇక్కడ మే 17 నాటికి 92 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖయ్య 438కి చేరింది. 3న పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ దేశీయ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం జూన్ 3న సమావేశం కానుంది. ఆ రోజు తమ ముందు హాజరై కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, రాష్ట్రాలతో సమన్వయం, లాక్డౌన్ అమలు తీరును వివరించాలంటూ ఈ స్థాయీ సంఘం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘానికి సీనియర్ కాంగ్రెస్ నేత ఆనంద్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన అనంతరం జూన్ 3న తొలిసారిగా భేటీ కానుంది. -
ఒక్కరోజులోనే 4,987
న్యూఢిల్లీ: ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987 పాజిటివ్ కేసులు.. ఏకంగా 120 మరణాలు. భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం ఏమాత్రం ఆగడం లేదనడానికి నిదర్శనాలివీ. కరోనా పాజిటివ్ కేసులు 90 వేల మార్కును దాటేయడం గుబులు రేపుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు దేశంలో 4,987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ప్రభావం మొదలయ్యాక ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. అలాగే గత 24 గంటల్లో 120 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 90,927కు, మరణాలు 2,872కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్‌కరోనా కేసులు 53,946 కాగా, 34,108 మంది బాధితులు చికిత్సతో కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 37.51 శాతానికి పెరగడం కొంతలో కొంత ఊరట కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. మూడు రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 30,706, గుజరాత్లో 10,988, తమిళనాడులో 10,585 పాజిటివ్ కేసులు బహిర్గతం అయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం మరణాలు 2,872 కాగా, ఇందులో 1,135 మరణాలు కేవలం మహారాష్ట్రలో సంభవించాయి. గుజరాత్లో 625 మంది, మధ్యప్రదేశ్‌లో 243, పశ్చిమ బెంగాల్లో 232, ఢిల్లీలో 129, రాజస్తాన్‌లో 126, ఉత్తరప్రదేశ్‌లో 104, తమిళనాడులో 74 మంది కరోనా బారినపడి మృతి చెందారు. 13.6 రోజుల్లో రెట్టింపు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యేందుకు ప్రస్తుతం 13.6 రోజుల సమయం పడుతోందని ఆరోగ్యశాఖ తెలి పింది. 14 రోజుల నుంచి 11.5 రోజులుగా ఉన్న ఈ గడువు గత మూడు రోజులుగా 13.6 రోజులకు చేరిందంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య 3.1 శాతమని పేర్కొంది. దేశంలో 8 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని తెలిపింది. కరోనా కేసులు 106 రోజుల్లో 80 వేల మార్కును దాటాయని, అభివృద్ధి చెందిన యూకే, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల్లో ఇందుకు 44–66 రోజుల సమయం పట్టిందని పేర్కొంది. -
24 గంటల్లో 650 కేసులు, 30 మరణాలు
న్యూఢిల్లీ : కరోనా విజృంభనతో భారత్‌లో పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 650 కేసులు నమోదయ్యాయి. 30 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఆరు వందలకు పైగా కేసులు నమోదవ్వడం ఇదే రికార్డుగా మారింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6412కు చేరింది. మృతుల సంఖ్య 200 చేరువగా ఉంది. ప్రస్తుతం 5709 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. 504 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (కరోనాపై పోరు: 100 మందిని కాపాడినా చాలు!) కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర 1364 కేసులతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు 834, ఢిల్లీ 720 ఉన్నాయి. 442 కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ 410, కేరళ 357, మధ్య ప్రదేశ్ 259, గుజరాత్ 241, కర్ణాటక 181, హర్యానా 169, జమ్మూ కశ్మీర్ 158, పశ్చిమ బెంగాల్ 116, పంజాబ్ 101, ఒడిశా 44, బిహార్ 39, ఉత్తరాఖండ్ 35, అస్సాం 29, చండీగఢ్ 18, హిమాచల్ ప్రదేశ్ 18, జార్ఖండ్ 13, అండమాన్ నికోబార్ 11, చత్తీస్‌గఢ్ 11, గోవా 7, పుదుచ్చేరి 5, మణిపూర్ 2, త్రిపుర 1, మిజోరాం 1, అరుణాచల్ ప్రదేశ్‌లో 1 చొప్పున నమోదయ్యాయి. (లాక్డౌన్ : బిలియనీర్ల విందు, ఉన్నతాధికారిపై వేటు) Increase of 547 new COVID19 cases 30 deaths in last 12 hours; India's total number of #Coronavirus positive cases rises to 6412 (including 5709 active cases, 504 cured/discharged/migrated and 199 deaths): Ministry of Health and Family Welfare pic.twitter.com/N9fLxsqy4a — ANI (@ANI) April 10, 2020 -
డీఐవై మాస్క్‌లు వాడండి: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మాస్క్‌ల అవసరం అంతకంతకూ పెరిగిపోతోంది. దేశంలో మాస్క్‌ల వినియోగానికి తగ్గ ఉత్పత్తి లేని పరిస్థితుల్లో కొద్దిరోజుల్లో మాస్క్‌ల కొరత వేధించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇంట్లో తయారుచేసిన పునర్వినియోగ మాస్క్‌లను ఉపయోగించాలని కేంద్ర ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది. అనారోగ్య సమస్యలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు లేని వారు ఇంట్లో తయారు చేసిన మాస్క్‌లను ఉపయోగించాలని పిలుపునిచ్చింది. ( కూల్‌డ్రింక్‌లో షేవింగ్ లోషన్.. ఇద్దరు మృతి! ) ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పుడు వాటిని కచ్చితంగా ఉపయోగించాలని కోరింది. కరోనా వ్యాప్తి అడ్డుకోవటానికి ఇదెంతో ఉపకరిస్తుందని ఆరోగ్య శాఖ పేర్కొంది. హెల్త్ వర్కర్స్, కరోనా బాధితులకు చికిత్స చేసే వారు వీటిని వాడాల్సిన అవసరం లేదని, వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మాస్క్‌లను ధరించాలని స్పష్టం చేసింది. ఇంట్లోనే పునర్వినియోగ ఫేస్ మాస్క్‌లను తయారు చేసుకునే విధానం : కావాల్సిన వస్తువులు : ఏదైనా కాటన్ వస్త్రం, నాలుగు క్లాత్ స్ట్రిప్స్, కత్తెర, కుట్టుమిషన్ తయారీ పద్ధతి : -
ప్రత్యేక ఆస్పత్రుల ఏర్పాటు: కేంద్రం
-
తగ్గిన శిశుమరణాల రేటు
57 నుంచి 41 శాతానికి దిగివచ్చిన ఐఎంఆర్ • దేశంలో మెరుగైన లింగనిష్పత్తి • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: గత పదేళ్లలో శిశుమరణాల రేటు(ఐఎంఆర్) దేశవ్యాప్తంగా గణనీయంగా తగ్గిందని సర్వేలో తేలింది. 2005–06లో ప్రతి వేయి మంది శిశువులకు 57 మంది చనిపోతుండగా 2015–16నాటికి ఆ రేటు 41కి పడిపోయింది. త్రిపుర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్తాన్ , ఒడిశాల్లో ఐఎంఆర్ సుమారు 20 శాతానికి పైగా తగ్గింది. మంగళవారం విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ ఎఫ్హెచ్ఎస్–4) ప్రకారం...జనన సమయంలో లింగ నిష్పత్తి(ప్రతి వేయి మంది పురుషులకు స్త్రీల సంఖ్య) జాతీయ స్థాయిలో 914 నుంచి 919కి పెరిగింది. ఈ జాబితాలో కేరళ(1047), మేఘాలయ(1009), ఛత్తీస్‌గఢ్(977) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 38.7 శాతం నుంచి 78.9 శాతానికి పెరిగింది. తక్కువ బరువున్న పిల్లల శాతం 7 శాతం తగ్గిందని తెలిపింది. 6–59 నెలల మధ్యనున్న పిల్లల్లో అనీమి యా 69 శాతం నుంచి 59 శాతానికి దిగివచ్చినట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా 6 లక్షల గృహాలు, 7 లక్షల మహిళలు, 1.3 లక్షల పురుషుల నుంచి సమాచారం సేకరించి ఈ సర్వే జరిపారు. ఈసారి జిల్లాలవారీగా కూడా గణాంకాలు తయారు చేశారు. అనవసర సిజేరియన్ లు వద్దు అనవసర సిజేరియన్ చికిత్సలను కట్టడిచేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను కోరింది. ప్రైవేట్ రంగంలో ఇవి ఒక్కసారిగా పెరిగాయని సర్వే సూచించిన నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2005–06లో(ఎన్ ఎఫ్హెచ్ఎస్–3) 8.5 శాతంగా ఉన్న జాతీయ సగటు సిజేరియన్ శస్త్రచికిత్సలు 2015–16 నాటికి 17.2 శాతానికి పెరిగాయి. ప్రైవేట్ రంగంలో ఇవి 2005–06లో 27.7 శాతంగా ఉండగా 2015–16 నాటికి 40 శాతానికి చేరాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ చికిత్సలు 2015–16 కాలానికి 15.2 శాతం నుంచి 11.9 శాతానికి పడిపోయాయి. అవసరమైనప్పుడే సిజేరియన్ ఆపరేషన్లు చేసేలా ప్రైవేటు ఆసుపత్రులను ఒప్పించాలని రాష్ట్రాలను కోరుతున్నట్లు ఆరోగ్య శాఖ కార్యదర్శి సీకే మిశ్రా విలేకర్లతో చెప్పారు.