సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,848 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,358 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 68,817 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,89,94,855 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,43,194 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,00,28,709 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 54,24,374 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 29,46,39,511కు చేరుకుంది. గత 24 గంటల్లో 19,01,056 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 96.56 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
చదవండి: హైవేలో లారీ పార్క్ చేస్తే అంతే..!
Comments
Please login to add a commentAdd a comment