
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,46,157కు చేరుకుంది. ప్రస్తుతం 1,61,334 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. కరోనా వల్ల మరో 805 మంది మృతిచెందారు. దీంతో కరోనా సంబంధిత మరణాల సంఖ్య 4,57,191కు ఎగబాకింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0.47 శాతం ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.19 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా 3,36,27,632 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment