
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,422 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3,88,135 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక గత 24 గంటల్లో 78,190 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,844,199 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,02,887 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 28,00,36,898 మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
చదవండి: ఈ భూమిపై మాకింత చోటేది?
Comments
Please login to add a commentAdd a comment