24 గంటల్లో 650 కేసులు, 30 మరణాలు | Corona: India has 650 New cases And 30 deaths In Last 24 Hours | Sakshi
Sakshi News home page

భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

Published Fri, Apr 10 2020 10:46 AM | Last Updated on Fri, Apr 10 2020 11:48 AM

Corona: India has 650 New cases And 30 deaths In Last 24 Hours - Sakshi

న్యూఢిల్లీ : కరోనా  విజృంభనతో భారత్‌లో పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 650 కేసులు నమోదయ్యాయి. 30 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఒక్క రోజు వ్యవధిలోనే ఆరు వందలకు పైగా కేసులు నమోదవ్వడం ఇదే రికార్డుగా మారింది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటల వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 6412కు చేరింది. మృతుల సంఖ్య 200 చేరువగా ఉంది. ప్రస్తుతం 5709 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. 504 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (కరోనాపై పోరు: 100 మందిని కాపాడినా చాలు!)

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే.. మహారాష్ట్ర 1364 కేసులతో మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు 834, ఢిల్లీ 720 ఉన్నాయి. 442 కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్‌ 410, కేరళ 357, మధ్య ప్రదేశ్‌ 259, గుజరాత్‌ 241, కర్ణాటక 181, హర్యానా 169, జమ్మూ కశ్మీర్‌ 158, పశ్చిమ బెంగాల్‌ 116, పంజాబ్‌ 101, ఒడిశా 44, బిహార్‌ 39, ఉత్తరాఖండ్‌ 35, అస్సాం 29, చండీగఢ్‌ 18, హిమాచల్‌ ప్రదేశ్‌ 18, జార్ఖండ్‌ 13, అండమాన్‌ నికోబార్‌ 11, చత్తీస్‌గఢ్‌ 11, గోవా 7, పుదుచ్చేరి 5, మణిపూర్‌ 2, త్రిపుర 1, మిజోరాం 1, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 1 చొప్పున నమోదయ్యాయి. (లాక్‌డౌన్‌ : బిలియనీర్ల విందు, ఉన్నతాధికారిపై వేటు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement