సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో మళ్లీ 2లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 2,08,921 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 4,147 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. కొత్త మరణాలతో కలుపుకుని మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,11,388 కు పెరిగింది. మరణాల రేటు 1.14 శాతంగా నమోదైంది. మరోవైపు, దేశంలో పాజిటివిటీ రేటు 9.60 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో 2,95,955 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,43,50,816కు చేరుకుంది. రికవరీ రేటు 89.26 శాతానికి పెరిగింది. అదే సమయంలో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 24,95,591కు చేరింది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 20,39,087 మంది కాగా.. రికార్డ్ స్థాయిలో 22,17,320 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
(చదవండి: కోవిడ్ వల్ల అనాథలుగా 577 మంది బాలలు)
Comments
Please login to add a commentAdd a comment