సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశంలో కోవిడ్-19 కేసులు, మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కేసులు నమోదు కాగా.. 977 మంది వైరస్ బారిన పడి మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా ఉండగా 53,866 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది.
Comments
Please login to add a commentAdd a comment