
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయితే నిన్నటితో పోల్చితే.. దేశంలో స్వల్పంగా కరోనా కేసులు పెరిగాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2,330 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి దేశంలో మొత్తం 3,81,903 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక గత 24 గంటల్లో 1,03,570 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,84,91,670 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 8,26,740 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 19,31,249 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 38,52,38,220కు చేరుకుంది. ఇక దేశంలో ఇప్పటివరకు 26,55,19,251 మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment