
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా, టీబీ రోగులకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకినవారు టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. టీబీ రోగులంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. కాగా, భారతీయ చిన్నారులు కీలకమైన కోవిడ్ టీకాను పొందలేకపోతున్నారనే వార్తలపై కేంద్ర ఆరోగ్యం శాఖ శనివారం స్పందించింది. అన్ని రాష్ట్రాలతో కోవిడ్ నెగిటివ్ ప్రభావాలను తగ్గించే చర్యలపై నిరంతరం చర్చిస్తున్నామని తెలిపింది. సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ టీకాలు అందిస్తామని భరోసా ఇచ్చింది.
ప్రపంచంలో భారత్‌లోనే అత్యధికంగా టీకా పొందని పిల్లలున్నారని, వీరి సంఖ్య సుమారు 35 లక్షలని యూనిసెఫ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. కరోనా ఆరంభం నుంచి అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చింది. 2021 తొలి త్రైమాసికానికి దేశంలో 99 శాతం డీటీపీ3 కవరేజ్ చేశామని తెలిపింది. సార్వత్రిక టీకా ప్రోగ్రామ్‌లో భాగంగా అందరికీ టీకాలు తప్పక అందిస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment