
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో 73 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసులు 8 లక్షల దిగువకు నమోదయ్యాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,587 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,83,490 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో ప్రస్తుతం 7,98,656 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.03 శాతం. కాగా, మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 26.89 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
చదవండి: జేఎన్‌యూ విద్యార్థి నేతల విడుదల
Comments
Please login to add a commentAdd a comment