‘కోవిడ్‌ చికిత్సకు పాజిటివ్‌ రిపోర్ట్‌ అక్కర్లేదు’ | Covid Positive Report Not Necessary For Hospitalisation | Sakshi
Sakshi News home page

‘కోవిడ్‌ చికిత్సకు పాజిటివ్‌ రిపోర్ట్‌ అక్కర్లేదు’

Published Sat, May 8 2021 5:52 PM | Last Updated on Sat, May 8 2021 6:20 PM

Covid Positive Report Not Necessary For Hospitalisation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌ - 19 పాజిటివ్‌ రోగుల్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి కచ్చితంగా ఆ రిపోర్ట్‌ అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కోవిడ్‌ రిపోర్ట్‌ ఉండాలనే నిబంధనను సవరిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌ ఆరోగ్య సదుపాయంలో భాగంగా చికిత్ప కోసం కోవిడ్‌-19 పాజిటివ్‌ రిపోర్ట్‌ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం..ఏ రోగికి కూడా చికిత్స నిరాకంచవద్దు. రోగి వేరే నగరానికి చెందినవాడైనప్పటికీ అవరమైన మందులు, ఆక్సిజన్‌ అందించాల్సిందేనని ఓ ప్రకటనలో పేర్కొంది. చికిత్సకు వచ్చే వారిని సీసీసీ, డీసీహెచ్‌సీ, డీహెచ్‌సీ వార్డులో అనుమానిత కేసులుగా చేర్చుకోవాలని సూచించింది.కోవిడ్‌-19తో బాధపడుతున్న రోగులకు సత్వరం, సమర్థవంతమైన చికిత్స అందించాలని తెలిపింది. ఆసుపత్రిలో రోగిని అవసరాన్ని బట్టి చేర్చుకోవాలని, పడకలు నిబంధనలకు విరుద్దంగా ఆక్రమించకుండా చూసుకోవాలని తెలిపింది.
(చదవండి: జూపార్క్‌పై కోవిడ్‌ దెబ్బ: 20 మంది ఉద్యోగులపై వేటు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement