న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 46 రోజులతో పోల్చితే ఈ రోజు కోవిడ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. గత 24గంటల్లో భారత్‌లో 1,65,553 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 3,617 మంది కోవిడ్‌తో మృతి చెందారు. కొత్త మరణాలతో కలుపుకుని మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 3,25,972కు పెరిగింది.
అదేవిధంగా గత 24 గంటల్లో 2,76,309 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,54,54,320కు చేరుకుంది. అదే సమయంలో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,14,508కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 20,63,839 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 34,31,83,748కు చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21,20,66,614 కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
(చదవండి: సీఆర్‌పీఎఫ్ డీజీకి ఎన్‌ఐఏ బాధ్యతలు)
Comments
Please login to add a commentAdd a comment