
దేశంలో కొద్దీ రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించకపోవడం వల్లనే అని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కు ధరించకపోయిన, రైళ్లలో, స్టేషన్ లలో ఉమ్మివేసిన రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.
ఆరు నెలల పాటు ఈ నిబంధన కొనసాగుతాయని రైల్వేశాఖ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా నిబందనలు పాటించాలని పేర్కొంది. వలస కార్మికులు దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో.. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని భయంతో కార్మికులంతా మళ్లీ ఇళ్లకు పయనమవుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరలా వారివారి రాష్ట్రాలకు వెళ్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కరోనా కట్టడికి ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే తమ స్వంత రాష్ట్రాలకు వస్తున్న కార్మికులకు ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment