సాక్షి, అమరావతి: మాస్కులు ధరిస్తే కరోనా సోకకుండా ఉంటుందనేది ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే చాలామంది చాలా రకాల మాస్కులు వాడుతున్నారు. కొందరైతే.. ఖరీదైన ఎన్–95 మాస్కుల్ని వాడుతున్నారు. ఇవి ఎదుటి వ్యక్తి నుంచి ధరించిన వారికి ఎంతమేరకు భద్రత ఇస్తున్నాయనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
నిపుణులు ఏమంటున్నారంటే..
► ఐదారు మంది జనం ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాత్రమే మాస్కు వాడితే ఉపయోగం లేదు.
► అందరూ వాడితేనే నూరు శాతం ఫలితాలుంటాయి. లేదంటే 50 శాతం ఫలితాలు మాత్రమే.
► ఇరువురికి మాస్కు ఉంది కదా అని ముఖంలో ముఖం పెట్టి మాట్లాడటం మంచిది కాదు.
► అంత దగ్గర నుంచి మాట్లాడితే 5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న తుంపర్లు నేరుగా నోరు లేదా ముక్కు ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది.
► ఇలాంటి అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఉన్న తుంపర్లను ఎన్–95 మాస్కులు నియంత్రించగలవని వైద్యుల అభిప్రాయం.
► మాస్కులు ఉన్నప్పటికీ ఎలాంటి ఉపరితలంపై అయినా చేయి తగలగానే శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
► పదే పదే మాస్కులు ఎక్కడంటే అక్కడ తగలడం వల్ల వాటి ఉపయోగం కన్నా ప్రమాదం ఎక్కువ.
మాస్కు ఉంది కదాని..
మాస్కు ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వాడకూడదు. అత్యంత జాగ్రత్తగా వాడాలి. మాస్కు ఉన్నా ఆరు అడుగుల దూరం తప్పనిసరి. మనవల్ల ఎదుటి వారికి ఎంత ప్రమాదమో.. వారినుంచి మనకూ అంతే ప్రమాదం అని గుర్తించాలి. ఏ వస్తువును తగిలినా అనంతరం శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
– డాక్టర్ నీలిమ, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్, కమాండ్ కంట్రోల్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment