సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి కారణంగా ఎవరు ఎలాంటి మాస్కులు వాడాలో ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇప్పటివరకూ ఏ వయసు వారు ఎలాంటి మాస్కులు వాడాలన్న ప్రత్యేక నిబంధనలేవీ లేవు. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు ఇవీ..
► 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళితే తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
► 60 ఏళ్లు పైబడిన వారు విధిగా సర్జికల్ మాస్కు వాడాలి.
► ఐదేళ్ల లోపు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు.
► 5 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణలో మాస్కులు ధరించవచ్చు. హైరిస్క్ ప్రాంతాలను బట్టి ఆ మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
► 12 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఫ్యాబ్రిక్ మాస్కు (3 పొరల వస్త్రంతో)ను వాడవచ్చు.
60 ఏళ్లు దాటితే విధిగా సర్జికల్ మాస్క్
Published Mon, Aug 24 2020 4:32 AM | Last Updated on Mon, Aug 24 2020 4:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment