రికార్డులు బ్రే‘కప్’..
సాధారణ పింగాణీ పాత్రలాగ కనిపిస్తున్న ఇది.. చెంగువా చికెన్ కప్. 1465లో అప్పటి చైనాను పాలించిన చెంగువా పాలకుల హయాంలో వీటిని తయారుచేశారు. మ్యూజియంలను మినహాయిస్తే.. ప్రైవేటు వ్యక్తుల వద్ద ప్రస్తుతం ఇలాంటి కప్‌లు నాలుగు మాత్రమే ఉన్నాయి.
అంతటి అరుదైనదన్న మాట. వచ్చే నెల 8న దీన్ని హాంకాంగ్‌లో వేలం వేయనున్నారు. అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ.. కనీసం రూ.245 కోట్లు పలుకుతుందని అంచనా.