హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. ఆతిథ్య చైనా జట్టుతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 3–0 గోల్స్ తేడాతో గెలిచింది.
భారత్ తరఫున సుఖ్‌జీత్ సింగ్ (14వ ని.లో), ఉత్తమ్ సింగ్ (27వ ని.లో), అభిõÙక్ (32వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మలేసియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ 2–2తో... జపాన్, దక్షిణ కొరియా మధ్య మ్యాచ్ 5–5తో ‘డ్రా’గా ముగిశాయి.
నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది. తొలి విజయంతో భారత్ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈనెల 17 వరకు మొత్తం ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ?
Comments
Please login to add a commentAdd a comment